అలాంటి వ్యక్తులతో జాగ్రత్త : ఎన్టీఆర్

వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయవద్దని ప్రముఖ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఫేస్‌బుక్‌/ ట్విటర్‌ వంటి మాధ్యమాల్లో పోస్ట్‌ చేసే సమాచారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అలాంటి వ్యక్తులతో జాగ్రత్త : ఎన్టీఆర్
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 08, 2020 | 7:48 PM

వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయవద్దని ప్రముఖ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఫేస్‌బుక్‌/ ట్విటర్‌ వంటి మాధ్యమాల్లో పోస్ట్‌ చేసే సమాచారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు దారితీస్తాయని చెప్పారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. సొసైటీలో జరుగుతున్న నేరాలపై ప్రజల్ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్న హైదరాబాద్‌ సిటీ పోలీసులు తాజాగా సైబర్‌ క్రైమ్స్‌కు సంబంధించి ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో వీడియోను రూపొందించారు. ఓ యువతికి ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి ద్వారా ఎదురైన చేదు అనుభవాన్ని కథాంశంగా పోలీసులు ఓ షార్ట్‌ వీడియోను రూపొందించారు.