AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police ‘i-Verify’: పోలీసు స్టేషన్ వెళ్లకుండానే వెరిఫికేషన్ సర్టిఫికేట్లు.. అందుబాటులోకి తెలంగాణ పోలీస్ ఆన్‌లైన్‌ సేవలు..

ఇకపై పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగకుండానే నెట్టింట్లో సర్టిఫికేట్లు రానున్నాయి. ఇందుకు కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Police ‘i-Verify’: పోలీసు స్టేషన్ వెళ్లకుండానే  వెరిఫికేషన్ సర్టిఫికేట్లు.. అందుబాటులోకి తెలంగాణ పోలీస్ ఆన్‌లైన్‌ సేవలు..
Police Verification Certificate Facility i Verify
Balaraju Goud
| Edited By: Team Veegam|

Updated on: May 06, 2021 | 2:57 PM

Share

Police ‘i-Verify’: ఇకపై పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగకుండానే నెట్టింట్లో సర్టిఫికేట్లు రానున్నాయి. ఇందుకు కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోలీసు వెరిఫికేషన్‌ సర్టిఫికేషన్‌ (పీవీసీ), పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్ల (పీసీసీ) కావాలనుకున్న వారు నేరుగా ఆన్‌లైన్‌లో ఐ–వెరిఫై ద్వారా దరఖా స్తు చేసుకునే విధానాన్ని పోలీస్‌ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ప్రారంభించారు. www.tspolice.gov.inను క్లిక్‌ చేసి పోలీస్‌ వెరిఫికేషన్‌–క్లియరెన్స్‌ ఆప్షన్స్‌ ఎంచుకుని.. నిబంధనలను ఫాలో అయితే సరిపోతుంది. మీకు కావల్సిన సర్టిఫికేట్‌ పొందవచ్చని పోలీసుల అధికారులు తెలిపారు.

పోలీసు వెరిఫికేషన్‌ ఎవరికి అవసరంః సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ సంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ శాఖ సంబంధ కార్యాలయాలు, అందులో అపాయింట్‌ అయ్యే ప్రైవేటు ఉద్యోగులు. ఆయా కార్యాలయాల్లో ఇతర సేవల కోసం పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు పోలీసు వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు.

పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్ః విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, వలస వెళ్లే పౌరులకు ఇది అవసరం. ఒకసారి దరఖాస్తు పూర్తి చేశాక పోలీసుల పని మొదలవుతుంది. దీనిపై సందేహాలుంటే హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్రదించాలి.

ప్రయోజనాలుః  ☸ ఈ విధానం అందుబాటులోకి రావడం వల్ల పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది.

☸ డాక్యుమెంట్ల దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపులు సులభతరంగా మారుతాయి.

☸ ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లోని ఫొటోల ఆధారంగా నేరచరిత కలిగిన వారిని సులువుగా గుర్తించే వీలుంది.

☸ దరఖాస్తుల పరిశీలనకు అదనపు మానవ వనరుల వినియోగం తగ్గింపు.

☸ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకునే సదుపాయం దరఖాస్తుదారులకు కలుగుతుంది.

Read Also… Fire in Bag: రోడ్డు మీద నడుస్తున్న వ్యక్తి బ్యాగ్ లో పేలుడు.. హడలి పోయిన జనం..పేలింది ఏమిటంటే.. Viral Video