AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Shelter: ఆర్టీసీ అధికారుల వినూత్న ఆలోచన… బస్సునే షెల్టర్ గా మార్చితే..! అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టాడు ఆ డిపో మేనేజర్

బస్సుషెల్టర్ అంటే బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉండే షెల్టర్.. అయితే, విచిత్రం ఎమిటంటే ఇక్కడ ప్రయాణికులకోసం బస్సే షెల్టర్‌గా మారింది.

Bus Shelter: ఆర్టీసీ అధికారుల వినూత్న ఆలోచన... బస్సునే షెల్టర్ గా మార్చితే..! అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టాడు ఆ డిపో మేనేజర్
Bus Shelter For Passangers At Vikarabad
Balaraju Goud
|

Updated on: Apr 21, 2021 | 6:06 PM

Share

Bus as Bus Shelter: బస్సుషెల్టర్ అంటే బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉండే షెల్టర్.. అయితే, విచిత్రం ఎమిటంటే ఇక్కడ ప్రయాణికులకోసం బస్సే షెల్టర్‌గా మారింది. ఆర్టీసీ అధికారుల వినూత్న ఆలోచనకు జీవం పోసుకుంది. ఎండకు, వానకు ఇబ్బందిపడుతున్న ప్రయాణీకుల బాధలు చూడలేక వికారాబాద్ బస్ డిపో మేనేజర్ రమేష్ ప్రయాణీకుల కోసం ఓ రన్నింగ్ బస్సునే షెల్టర్ గా మార్చారు. ప్రయాణికులుకు ఇబ్బందులను గుర్తించి.. ఆర్టీసి డిపోకే పరిమితమైన పాత బస్సులను ” బస్సు షెల్టర్” గా తయారు చేయించారు. నిత్యం రద్దీగా ఉండే వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఈ కొత్త రకం బస్ షెల్టర్‌ను ప్రవేశపెట్టారు డీఎం రమేష్.

బస్సుల రాకపోకల కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణీకులు ఎండలకు బాగా ఇబ్బంది పడుతున్నారు. వారు వెళ్లాల్సిన బస్సు వచ్చే దాకా షెల్టర్ లో వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ విషయం డిపో మేనేజర్ దృష్టిలో ఇది వెళ్లగా ఓ బస్సునే షెల్టర్ గా చేసి వెయిటింగ్ చేసే ప్రయాణీకులకు అందుబాటులో ఉంచారు. ఎండలు మండుతున్న కారణంగా బయట ఎక్కడ కూర్చోవడానికి స్థలం లేని వారు బస్సులో కూర్చోవడానికి వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో టెంపర్వరీ బస్సు షెల్టర్ పేరుతో ఒక బస్సు ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసి అధికారుల కోరుతున్నారు

ఆ బస్సునే షెల్టర్ గా చేసుకుని వారు ఎక్కాల్సిన బస్సు వచ్చినప్పుడు దిగి ఆ బస్సు ఎక్కేస్తున్నారు. షెల్టర్ అంటే కేవలం కూర్చోవడమే అని కాకుండా త్రాగు నీరుని సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సౌకర్యం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిపో మేనేజర్ చలువతో అక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేసినందుకు స్ధానికులు డీఎం రమేష్‌ను అభినందిస్తున్నారు.

Read Also… Police ‘i-Verify’: పోలీసు స్టేషన్ వెళ్లకుండానే వెరిఫికేషన్ సర్టిఫికేట్లు.. అందుబాటులోకి తెలంగాణ పోలీస్ ఆన్‌లైన్‌ సేవలు..