నిద్రపోయే ముందు రెండు ఖర్జురాలు తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. జుట్టు కూడా మేలే..

Date Palm Benefits: రోజూ ఖర్జురాలు తినడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్లు, ఐరన్, ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

  • Rajitha Chanti
  • Publish Date - 6:01 pm, Wed, 21 April 21
నిద్రపోయే ముందు రెండు ఖర్జురాలు తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. జుట్టు కూడా మేలే..
Date Palm

Date Palm Benefits: రోజూ ఖర్జురాలు తినడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్లు, ఐరన్, ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెంచడానికి మాత్రమే కాకుండా.. అనేక వ్యాధుల నుంచి ఇవి కాపాడతాయి. వీటిని రోజూ వారీ డైట్ లో తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలను కాపాడటమే కాకుండా.. మరిన్ని ప్రయోజనాలను చేకురుస్తుంది. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎముకలను బలపరుస్తుంది…
ఇందులో భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరచడమే కాకుండా.. కండరాల సమస్యలను తగ్గిస్తుంది.

2. కళ్ళ సమస్యలను..
రోజూ ఖర్జురాలను తినడం వలన కళ్ళకు మంచిది. ఇందులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. అందువలన కంటి సమస్యలను తగ్గించడమే కాకుండా.. కళ్ళను పూర్తి ఆరోగ్యంగా ఉంచుతుంది.

3. రోగ నిరోధక శక్తి..
రోజూ ఖర్జురాలను తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో విటిమిన్లు, ఐరన్ ఉండడం వలన చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.

4. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యకరమైన గుండె కోసం ఖర్జురాలు మంచివి. అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యలను శారీరక బలహీనత, రక్తహీనత, గుండె జబ్బులను నయం చేస్తాయ.

5. బరువు తగ్గడానికి సహయపడతాయి. ముఖ్యంగా బొడ్డు చుట్టూ ఉండే కొవ్వున తగ్గిస్తాయి.

6. రోజూ ఖర్జురాలను తినడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇవి సహయపడతాయి. అంతేకాకుండా చర్మ సమస్యలను తగ్గిస్తుతంది.

Also Read: SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

Ayushman Card: ఫ్రీగా ఆయుష్మాన్ కార్డు.. తీసుకున్నవారికి రూ.5 లక్షల బెనిఫిట్.. ఆ తేదీ వరకే ఛాన్స్..