దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ !
కర్నూల జిల్లా దేవరగట్టులో ఏటా దసరా నాడు... బన్నీ ఉత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రికి కర్రల సమరం నిర్వహించేందుకు

కర్నూల జిల్లా దేవరగట్టులో ఏటా దసరా నాడు… బన్నీ ఉత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రికి కర్రల సమరం నిర్వహించేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది కర్రల సమరాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించనున్నారు. బయటి వ్యక్తులు దేవరగట్టుకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం పూజా కార్యక్రమాలకు మాత్రమే నిర్వహించేందుకు అనుమతినిచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్లో మద్యం అమ్మకాలు నిషేధించారు.
అయితేే అనాదిగా వస్తున్న ఈ ఆచార సంప్రదాయాలను రద్దు చేయడం వల్ల అరిష్టం దాపురిస్తుందని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు చెబుతున్నారు. ఈ క్రమంలో తమ సంప్రదాయాలను ఎలాగైనా కొనసాగించేందుకు వివిధ గ్రామాల ప్రజలు రెడీ అవుతున్నారు.
Also Read :
Follow Us
