శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: మోడీ

ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. జాతినుద్ధేశించి ప్రసంగించిన మోడీ.. అంతరిక్షంలో భారత్ గొప్ప విజయాన్ని సాధించిందన్నారు. మిషన్ శక్తి ఆపరేషన్ సక్సెస్‌ అయినందుకు.. డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు ప్రధాని. మిషన్ శక్తి ద్వారా అంతరిక్షంలోని శాటిలైట్‌ను పడగొట్టామని మోడీ తెలిపారు. స్పేస్ సూపర్‌లీగ్‌లో భారత్ గొప్ప విజయాలను సాధిస్తోంది. అంతరిక్ష పరిశోధన ప్రయోగాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. పెద్ద పెద్ద దేశాలైన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:58 pm, Wed, 27 March 19
శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: మోడీ

ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. జాతినుద్ధేశించి ప్రసంగించిన మోడీ.. అంతరిక్షంలో భారత్ గొప్ప విజయాన్ని సాధించిందన్నారు. మిషన్ శక్తి ఆపరేషన్ సక్సెస్‌ అయినందుకు.. డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు ప్రధాని. మిషన్ శక్తి ద్వారా అంతరిక్షంలోని శాటిలైట్‌ను పడగొట్టామని మోడీ తెలిపారు. స్పేస్ సూపర్‌లీగ్‌లో భారత్ గొప్ప విజయాలను సాధిస్తోంది. అంతరిక్ష పరిశోధన ప్రయోగాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. పెద్ద పెద్ద దేశాలైన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలిచినందుకు గర్వకారణంగా ఉందని తెలిపారు మోడీ. అలాగే.. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు ప్రధాని మోడీ.