మోదీ పెయింటింగ్స్ విలువ‌ రూ.55 కోట్లు

బ్యాంకులకు కోట్లాది రూపాయలు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన 68 పెయింటింగ్స్‌ను అదాయపు పన్ను శాఖ మంగళవారం వేలం వేసింది. వీటి ద్వారా ఐటీ శాఖకు ఏకంగా రూ.55 కోట్లు సమకూరాయి. ఆదాయపు పన్ను శాఖ తరుపున సఫ్రోనార్ట్ ఈ వేలం నిర్వహించింది. రూ.13,000 కోట్ల పీఎన్‌బీ స్కామ్‌లో భాగంగా అధికారులు సీజ్ చేసిన నీరవ్ మోదీ కలెక్షన్లలో ఇవి ఒక భాగం మాత్రమే. కేమ్‌లట్ నుంచి దాదాపు రూ.96 […]

మోదీ పెయింటింగ్స్ విలువ‌ రూ.55 కోట్లు
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2019 | 2:51 PM

బ్యాంకులకు కోట్లాది రూపాయలు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన 68 పెయింటింగ్స్‌ను అదాయపు పన్ను శాఖ మంగళవారం వేలం వేసింది. వీటి ద్వారా ఐటీ శాఖకు ఏకంగా రూ.55 కోట్లు సమకూరాయి. ఆదాయపు పన్ను శాఖ తరుపున సఫ్రోనార్ట్ ఈ వేలం నిర్వహించింది.

రూ.13,000 కోట్ల పీఎన్‌బీ స్కామ్‌లో భాగంగా అధికారులు సీజ్ చేసిన నీరవ్ మోదీ కలెక్షన్లలో ఇవి ఒక భాగం మాత్రమే. కేమ్‌లట్ నుంచి దాదాపు రూ.96 కోట్ల రికవరీ లక్ష్యంగా ఈ వేలం జరిగింది. వేలంలో దాదాపు 100 మంది పాల్గొన్నారు. వేలంలో జొగెన్ చౌదురీ పెయింటింగ్ రూ.46 లక్షల ధర పలికింది. దీనికి రూ.18 లక్షలు విలువ అంచనా వేశారు. ఎఫ్.ఎన్ సౌజా 1955 ఇంక్ ఆన్ పేపర్‌కు రూ.32 లక్షలు వచ్చింది. అంచనా విలువ రూ.12 లక్షలతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ.

అలాగే కొన్ని పెయింటింగ్స్ ఏకంగా రూ.కోటికిపైగా ధర పలికింది. ఇందులో వి.ఎస్. గైటోండె వేసిన 1973 ఆయిల్ ఆన్ కాన్వాస్ ధర ఏకంగా రూ.25.24 కోట్లు. రాజా రవి వర్మ పెయింటింగ్‌ రూ.16.10 కోట్ల ధర పలికింది. అలాగే వేలంలో విక్రయమైన పెయింటింగ్స్‌లో కే లక్ష్మాగౌడ్, అక్బర్ పదంసే, రీనా కల్లత్, అతుల్ డోదియా, గుర్‌చరణ్ సింగ్, హెచ్ఏ గాదే వంటి కళాఖండాలు ఉన్నాయి.

ఈ క్రమంలో సఫ్రోనార్ట్ సీఈవో మరియు సహ వ్యవస్థాపకుడు దినేష్ వజిరాని మాట్లాడుతూ”మేము భవిష్యత్తులో ప్రభుత్వం మరియు దాని సంస్థలతో పనిచేయడానికి మరియు వేలం రంగంలో సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నాము” అని తెలిపారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు