‘పకోడా’, ‘భగోడా’ పథకాల మోదీ.. సిద్దు ఎద్దేవా!

నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం ఆర్ధిక సంక్షోభం తప్ప అభివృద్ధి లేదని కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దు మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ కేవలం రెండు పథకాలకు ప్రసిద్ధి చెందారని సిద్దు అన్నారు. అందులో ఒకటి యువకుల కోసం పకోడా పథకం.. మరొకటి భగోడా(ఇచ్చిన హామీల నుంచి పారిపోయే) పథకం అని దుయ్యబట్టారు. జాతీయ భద్రతపై దృష్టి సారించామని చెబుతున్న బీజేపీ ప్రజల […]

'పకోడా', 'భగోడా' పథకాల మోదీ.. సిద్దు ఎద్దేవా!
Follow us

|

Updated on: May 08, 2019 | 12:48 PM

నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం ఆర్ధిక సంక్షోభం తప్ప అభివృద్ధి లేదని కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దు మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మోదీ కేవలం రెండు పథకాలకు ప్రసిద్ధి చెందారని సిద్దు అన్నారు. అందులో ఒకటి యువకుల కోసం పకోడా పథకం.. మరొకటి భగోడా(ఇచ్చిన హామీల నుంచి పారిపోయే) పథకం అని దుయ్యబట్టారు. జాతీయ భద్రతపై దృష్టి సారించామని చెబుతున్న బీజేపీ ప్రజల హామీలు మాత్రం  నెరవేర్చడంలో అలసత్వం చూపిస్తోందని ఆరోపించారు. సామాన్యుడి సమస్యలు గురించి బీజేపీ పట్టించుకోవట్లేదని.. దేశంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో మోదీ భారీ కుంభకోణం చేశారని.. దీనిపై డిబేట్ కు ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్పిన విషయాన్ని సిద్దు గుర్తు చేశారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాదని.. ప్రచార మంత్రి అని.. తన సొంత ప్రచారం కోసం 6000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని” సిద్దు ఆరోపించారు.

బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్న మోదీ.. కనీసం సంవత్సరానికి  2 లక్షల ఉద్యోగాలను కూడా ఇవ్వలేదని సిద్దు ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో అగ్ని, పృథ్వి క్షిపణులను తయారు చేస్తున్న హెచ్ఎఎల్ (హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) లేదా డీఆర్డిఓకి వెళ్ళాల్సిన పెద్ద కాంట్రాక్టులు కూడా విదేశీ కంపెనీలకు వెళ్తున్నాయని అన్నారు.   .