బాలాకోట్ దాడులా? ఏమిటవి.! – సన్నీ డియోల్
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున గురుదాస్‌పూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సన్నీ డియోల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు బాలాకోట్ వైమానిక దాడులు గురించి తెలియదని కామెంట్ చేశాడు. అంతేకాకుండా తనకు ఇండియా- పాకిస్థాన్ మధ్య సంబంధాల గురించి కూడా తెలియదని స్పష్టం చేశాడు. మంగళవారం గురుదాస్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు. తనకు దాడులు గురించి తెలియదని.. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లోకి […]

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున గురుదాస్‌పూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సన్నీ డియోల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు బాలాకోట్ వైమానిక దాడులు గురించి తెలియదని కామెంట్ చేశాడు. అంతేకాకుండా తనకు ఇండియా- పాకిస్థాన్ మధ్య సంబంధాల గురించి కూడా తెలియదని స్పష్టం చేశాడు. మంగళవారం గురుదాస్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు.
తనకు దాడులు గురించి తెలియదని.. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లోకి వచ్చానని స్పష్టం చేశాడు. ఒకవేళ తాను గురుదాస్‌పూర్ నుంచి గెలిస్తే .. బాలాకోట్ దాడులు.. భారత్, పాకిస్థాన్ సంబంధాల గురించి తెలుస్తుందోమోనని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నో మంచి పనులు చేశారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో తాను కూడా గెలిస్తే తప్పకుండా మంచి పనులు చేసేందుకు పాటుపడతానని ప్రజలకు హామీ ఇచ్చారు. గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి సన్నీడియాల్‌పై కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ సునీల్ కుమార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శిరోమణి అకాళీదల్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ మూడుచోట్ల పోటీ చేస్తోంది. మిగతా 10 చోట్ల అకాళీదళ్ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.
