AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్..

ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది.  దేశవ్యాప్తంగా కరోనా నుంచి పేదలు ఇంకా పూర్తిగా కోలుకోని దృష్ట్యా  ఉచిత బియ్యం పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని అనుకుంటోంది...

రేషన్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్..
Sanjay Kasula
|

Updated on: Oct 30, 2020 | 1:16 PM

Share

Free Ration Scheme : ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది.  దేశవ్యాప్తంగా కరోనా నుంచి పేదలు ఇంకా పూర్తిగా కోలుకోని దృష్ట్యా  ఉచిత బియ్యం పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని అనుకుంటోంది. దీనిపై వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం గడువు నవంబర్‌తో ముగియనుంది. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు క్షీణించడం, వరదలతో పంటనష్టం సంభవిం చడం, నిర్మాణ రంగం ఇంకా కోలుకోక వలస కార్మికులు దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తుండటంతో ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలంటూ వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని ఇప్పటికే అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాలు, ఆర్థిక శాఖల అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి నుంచి విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పో యిన పేద, మద్య తరగతి రేషన్‌ కార్డుదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి 3 నెలలపాటు ఉచితంగా ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యంతోపాటు కార్డున్న ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేసింది.

Follow Us