ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

లక్నో : ప్రధాని మోదీ ఇవాళ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. వారణాసిలో డీజిల్‌ ఇంజిన్‌ నుండి ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌గా మార్చిన మొట్టమొదటి రైలును జెండా ఊపి ప్రారంభించారు. అయితే డీజిల్‌ ఇంజిన్‌ నుంచి ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌గా మార్చడం భారత్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రాడ్‌ గేజ్‌ విభాగంలోని రైళ్లన్నింటినీ ఎలక్ట్రిక్‌గా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. రైలు ప్రారంభించిన ఆనంతరం […]

ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:19 PM

లక్నో : ప్రధాని మోదీ ఇవాళ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. వారణాసిలో డీజిల్‌ ఇంజిన్‌ నుండి ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌గా మార్చిన మొట్టమొదటి రైలును జెండా ఊపి ప్రారంభించారు. అయితే డీజిల్‌ ఇంజిన్‌ నుంచి ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌గా మార్చడం భారత్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రాడ్‌ గేజ్‌ విభాగంలోని రైళ్లన్నింటినీ ఎలక్ట్రిక్‌గా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. రైలు ప్రారంభించిన ఆనంతరం మోడి దానిని క్షుణ్ణంగా పరిశీలించారు. తరువాత ప్రధాని సంత్‌ రవిదాస్‌ ఆలయంలో జరిగే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో చేపట్టనున్న అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు.