AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pitru Paksha: భారత్‌లోనే కాదు.. మెక్సికో నుంచి చైనా వరకు పూర్వీకులను ఇలా స్మరించుకుంటారు!

Pitru Paksha In Other Traditions: పితృపక్షం హిందూ సంప్రదాయంలో పూర్వీకులను స్మరించుకునే పవిత్ర సమయం. శ్రాద్ధం, దానధర్మాలు, ప్రార్థనల ద్వారా పితృదేవతలను తలచుకుంటారు. అయితే హిందువులకే కాదు.. ప్రపంచంలోని వివిధ మతాలు, సంస్కృతుల్లోనూ పూర్వీకులను గుర్తుచేసుకునేందుకు ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి.

Pitru Paksha: భారత్‌లోనే కాదు.. మెక్సికో నుంచి చైనా వరకు పూర్వీకులను ఇలా స్మరించుకుంటారు!
Pitru Paksha In Other Traditions
Rajashekher G
|

Updated on: Oct 07, 2026 | 11:23 AM

Share

Pitru Paksha Telugu: ప్రపంచంలోని దాదాపు ప్రతి సంస్కృతిలోనూ పూర్వీకులను స్మరించుకునే సంప్రదాయం కనిపిస్తుంది. క్రైస్తవుల్లో ఆల్ సోల్స్ డే, ముస్లింలలో షబ్-ఎ-బరాత్, యూదుల్లో యాహర్‌జైట్, యిజ్కోర్ వంటి ఆచారాలు ఇందుకు ఉదాహరణలు. పేర్లు, పద్ధతులు వేర్వేరైనా.. తమను ఈ లోకానికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు, తాతముత్తాతలను స్మరించుకోవాలనే భావన మాత్రం అందరిలోనూ కనిపిస్తుంది. హిందూ సంప్రదాయంలో పూర్వీకుల స్మరణకు ప్రత్యేకంగా ఒక పక్షాన్నే కేటాయించారు. భాద్రపద పౌర్ణమి నుంచి ఆశ్వయుజ అమావాస్య వరకు కొనసాగే కాలాన్ని సాధారణంగా పితృపక్షం లేదా శ్రాద్ధపక్షం అంటారు. ఈ సమయంలో మరణించిన కుటుంబ సభ్యుల తిథి ప్రకారం శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. వారి పేరుతో అన్నదానం, వస్త్రదానం, దానధర్మాలు చేయడం ద్వారా పితృదేవతలను స్మరించుకుంటారు.

ఎందుకు శుభకార్యాలు చేయరు?

పితృపక్షంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను సాధారణంగా నివారిస్తారు. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలోనూ కొందరు కుటుంబాలు నియమాలను పాటిస్తాయి. ఈ కాలాన్ని భౌతిక వేడుకల కంటే పూర్వీకుల జ్ఞాపకాలు, దానధర్మాలు, ప్రార్థనలకు అంకితం చేయాలనే ఆధ్యాత్మిక భావన దీనికి కారణంగా చెబుతారు. పూర్వకాలంలో ఈ సమయం వర్షాకాలం ముగిసి, వ్యవసాయ పనులు పూర్తయ్యే దశకు దగ్గరగా ఉండేది. అందువల్ల కుటుంబ సభ్యులు ఒకచోట చేరి పితృకార్యాలు నిర్వహించేందుకు అనుకూల సమయంగా కూడా భావించేవారు.

ఇతర మతాల్లోనూ పూర్వీకుల స్మరణ

పూర్వీకులను గుర్తుచేసుకునే సంప్రదాయం కేవలం హిందూ ధర్మానికే పరిమితం కాదు. మెక్సికోలో డే ఆఫ్ ది డెడ్ సందర్భంగా మరణించిన కుటుంబ సభ్యులను స్మరించుకుంటారు. చైనాలో కింగ్‌మింగ్ సందర్భంగా పూర్వీకుల సమాధులను శుభ్రపరచి నివాళులు అర్పిస్తారు. జపాన్‌లో ఒబోన్ పండుగలో పూర్వీకుల ఆత్మలను స్మరిస్తారు.

ఇవి కూడా చదవండి

యూదుల సంప్రదాయంలో మరణించిన వారి జ్ఞాపకార్థం ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి ప్రార్థనలు చేస్తారు. పార్సీలు కూడా తమ పవిత్ర సంప్రదాయాల్లో పూర్వీకులను స్మరించుకుంటూ ప్రార్థనలు, దానధర్మాలు నిర్వహిస్తారు.

సద్కర్మలే నిజమైన నివాళి

బౌద్ధ సంప్రదాయంలో పూర్వీకుల స్మరణ సందర్భంగా ప్రార్థనలు, ధ్యానం, దానధర్మాలు చేయడం కనిపిస్తుంది. తమ సత్కర్మలను పూర్వీకులకు అంకితం చేయాలనే భావనకు ప్రాధాన్యం ఉంటుంది. జైన, బౌద్ధ సంప్రదాయాలు జీవించి ఉన్న తల్లిదండ్రుల సేవకే అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి.

సిక్కు సంప్రదాయంలోనూ పిండప్రదానం వంటి కర్మకాండలకు బదులుగా అరదాస్, గురుబాణి, కీర్తనల ద్వారా పూర్వీకులను స్మరించుకుంటారు. పూర్వీకులు చూపిన సేవ, మంచితనం, మానవత్వం వంటి మార్గాల్లో నడవడమే వారికి నిజమైన నివాళి అనే భావనకు ప్రాధాన్యం ఇస్తారు.

మొత్తానికి.. పితృపక్షం అనేది కేవలం ఒక ఆచారం కాదు.. మన మూలాలను, మన కోసం జీవించిన పూర్వీకులను గుర్తుచేసుకునే ఆత్మీయ సందర్భం. వారి జ్ఞాపకార్థం చేసే దానం, ప్రార్థనలతో పాటు వారు చూపిన మంచి మార్గంలో నడవడమే వారికి అందించే గొప్ప గౌరవం.

(Disclaimer: ఈ కథనంలోని విషయాలు వివిధ మతాలు, సంప్రదాయాల్లో ఉన్న విశ్వాసాలు, ఆచారాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా కాకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశ్వాసాలుగా పరిగణించాలి.)

Follow Us