AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఓటీటీని షేక్ చేస్తోన్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్

దేశాన్ని కుదిపేసిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు.కేవలం 3 ఎపిసోడ్లతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోంది. ఐఎమ్‌డీబీలోనూ ఈ సిరీస్ కు 7.6 రేటింగ్ దక్కడం విశేషం.

OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఓటీటీని షేక్ చేస్తోన్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్
OTT Movie
Basha Shek
| Edited By: |

Updated on: Oct 07, 2026 | 11:20 AM

Share

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రముఖ వ్యక్తుల ఆధారంగా బయోపిక్ లు కూడా వస్తున్నాయి. ఆడియెన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో వచ్చే సైకో-థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ కథలకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీ గురించే. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ సామూహిక హత్యచార ఘటన ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. కేవలం 3 ఎపిసోడ్లతో సాగే ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే.. 2020 సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక 19 ఏళ్ల దళిత యువతిపై కొందరు మృగాళ్లు అతికిరాతకంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన ఆ బాధితురాలు సెప్టెంబర్ 29న చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. దీనికి తోడు బాధితురాలి మృతదేహానికి అర్ధరాత్రి వేళ పోలీసులే అంత్యక్రియలు నిర్వహించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. మరి పోలీసులు ఇలా చేయడానికి కారణమేంటి? ఈ ఘటనలో రాజకీయ శక్తుల ప్రమేయం ఉందా? ఆ దారుణం జరిగిన తర్వాతి 16 రోజుల్లో అక్కడ అసలేం జరిగింది? అధికార యంత్రాంగం కేసును ఎలా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది? అనే అంశాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ పేరు హత్రాస్ 16 డేస్ (Hathras 16 Days). దర్శకుడు ప్యాట్రిక్ గ్రాహం తెరకెక్కించిన ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో అంజలి శివరామన్, పవేల్ గులాటీ, కుముద్ మిశ్రా తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. సమర్ ఖాన్, ఆదిత్య పిత్తి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు ప్రముఖ సంస్థ ఐఎమ్‌డీబీ 7.6/10 రేటింగ్ ఇవ్వడం విశేషం. ఇక ఈ సిరీస్ కు ఉన్న మరో ప్లస్ పాయింట్ నిడివి తక్కువగా ఉండటం. మొత్తం మూడు ఎపిసోడ్లుగా ఈ సిరీస్ ను రూపొందించారు. మొదటి ఎపిసోడ్ 33 నిమిషాలు, రెండో ఎపిసోడ్ 34 నిమిషాలు, మూడో ఎపిసోడ్ 28 నిమిషాల నిడివితో సాగుతాయి. ప్రస్తుతం హత్రాస్ 16 డేస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ ను చూడవచ్చు.

హత్రాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us