కృత్రిమ చంద్రుని ఉపరితలం నిర్మిస్తున్న ఇస్రో..!

భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3 అంతరిక్ష నౌకను 2021లో ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్‌ సెన్సర్ల పనితీరు పరీక్షలను కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకా ఉల్లార్థి కావల్‌లోని ఇస్రో కేంద్రంలో నిర్వహించనున్నారు.

కృత్రిమ చంద్రుని ఉపరితలం నిర్మిస్తున్న ఇస్రో..!
Follow us

|

Updated on: Aug 31, 2020 | 6:49 PM

భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3 అంతరిక్ష నౌకను 2021లో ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్‌ సెన్సర్ల పనితీరు పరీక్షలను కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకా ఉల్లార్థి కావల్‌లోని ఇస్రో కేంద్రంలో నిర్వహించనున్నారు. గత ఏడాది చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో సక్రమంగా ల్యాండ్‌ కాకపోవడంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఉపగ్రహం ఉపరితలంపై ల్యాండ్‌ కావడానికి అవసరమైన ప్రయోగాలను ఈ కేంద్రంలో చేపడతున్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు.

చంద్రయాన్‌-3 అంతరిక్ష నౌక ల్యాండర్‌కు అక్కడి పరిస్థితులు, వాతావరణం తదితర వివరాలను చేరవేసే సెన్సర్ల పనితీరును పరీక్షిస్తారు. అందుకోసం కృత్రిమ రీతిలో చంద్రుని ఉపరితలాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. దీనికి సుమారు రూ.24.2 లక్షలను కేటాయించిన ఇస్రో గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. సెప్టెంబరు మొదటి వారంలో సంస్థను ఎంపిక చేసి నిర్మాణ బాధ్యతను అప్పగిస్తారు. గరిష్ఠంగా 10 మీటర్ల వ్యాసం, 3 మీటర్ల లోతుతో వివిధ ఆకారాలతో గుంతలను నిర్మించి అంతరిక్ష నౌక నుంచి ల్యాండర్‌ ల్యాండ్‌ కావడానికి అవసరమైన ప్రయోగాలు నిర్వహిస్తారు. చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అయ్యే పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు.