నిలకడగానే ఎస్పీబీ ఆరోగ్యంః ఎంజీఎం ఆసుపత్రి
కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బాలు గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

SPB Latest Health Update: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బాలు గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
అంతర్జాతీయ వైద్య నిపుణుల బృందం ఎస్పీబీకి చికిత్స అందిస్తున్నారని.. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని ఎంజీఎం ఆసుపత్రి వెల్లడించింది. అంతేకాకుండా ఫిజియోథెరపీకి బాల సుబ్రహ్మణ్యం స్పందిస్తున్నారని.. స్పృహలోనే ఉండి చికిత్స పొందుతున్నారని వైద్యులు స్పష్టం చేశారు.
Also Read:
‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!
ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!
”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..
IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్‌లు.. ఎప్పుడంటే..
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్‌లైన్ రమ్మీపై నిషేధం.!




