చెన్నైలో తీరని దాహం.. రైళ్ల కోసం జనం ఎదురుచూపులు
అస్సాం, మహారాష్ట్ర, ముంబై ప్రాంతాలు భారీ వర్షాలతో నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు ప్రజలు నీటి సంద్రంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు చెన్నై నగరం దాహంతో అల్లాడుతోంది. ప్రభుత్వం రైళ్ల ద్వారా నీటిని తరలించి జనం దాహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తోంది. రోజుకు 50 ట్యాంకర్లతో కూడిన రెండు రైళ్ల ద్వారా నీటిని తరలిస్తోంది. కుప్పం నుంచి జాల్లర్‌పేట్టెకు పైపు లైన్ల ద్వారా కావేరి జలాలను తరలిస్తున్నారు. అక్కడి నుంచి చెన్నైకు రైళ్లలో నీటిని […]
అస్సాం, మహారాష్ట్ర, ముంబై ప్రాంతాలు భారీ వర్షాలతో నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు ప్రజలు నీటి సంద్రంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు చెన్నై నగరం దాహంతో అల్లాడుతోంది. ప్రభుత్వం రైళ్ల ద్వారా నీటిని తరలించి జనం దాహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తోంది. రోజుకు 50 ట్యాంకర్లతో కూడిన రెండు రైళ్ల ద్వారా నీటిని తరలిస్తోంది. కుప్పం నుంచి జాల్లర్‌పేట్టెకు పైపు లైన్ల ద్వారా కావేరి జలాలను తరలిస్తున్నారు. అక్కడి నుంచి చెన్నైకు రైళ్లలో నీటిని తరలిస్తున్నారు. అయితే ట్యాంకుల ద్వారా వచ్చే నీరు తమకు సరిపోవడంలేదంటన్నారు అక్కడి జనం. నీటి కోసం పగలూ, రాత్రి కష్టాలు పడుతున్నామంటున్నారు. వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. రిజర్వాయర్లు ఎండిపోయాయి. దీంతో పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది.
జొల్లార్‌పేట్టె నుంచి రెండు రైళ్ల ద్వారా కోటి లీటర్ల నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి లారీ ట్యాంకర్ల ద్వారా చెన్నైలోని వివిధ ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారు. కాగా, నీటి సరఫరా సక్రమంగా జరగడానికి నగరాన్ని 15 జోనులుగా విభజించారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ట్యాంకర్ల నీటి కోసం ఎదురు చూస్తూ పనులకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు.