బాటిల్ క్యాప్ ఛాలెంజ్: నేనే దేవుణ్ణి.. నాకు ఇదో లెక్కా..!
సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో నెట్టింట రోజుకో ఛాలెంజ్ పుట్టుకొస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం బాటిల్ క్యాప్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యులు కూడా ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా చేస్తూ తమ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ ఛాలెంజ్‌ను ఓ నెటిజన్ వినూత్నంగా చేశాడు. వితు మౌళి అనే షోలో అజింక్యా రౌత్‌ను ఇన్ఫిరేషన్‌గా తీసుకున్న వైభవ్ శేత్కర్ అనే నెటిజన్.. […]
సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో నెట్టింట రోజుకో ఛాలెంజ్ పుట్టుకొస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం బాటిల్ క్యాప్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యులు కూడా ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా చేస్తూ తమ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ ఛాలెంజ్‌ను ఓ నెటిజన్ వినూత్నంగా చేశాడు. వితు మౌళి అనే షోలో అజింక్యా రౌత్‌ను ఇన్ఫిరేషన్‌గా తీసుకున్న వైభవ్ శేత్కర్ అనే నెటిజన్.. కృష్ణుడిలా కాస్ట్యూమ్ వేసుకొని తన కాలిని ఏ మాత్రం కదల్చకుండా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ చేశాడు. దేవుళ్లు పెట్టినట్లుగా చేతిని పెట్టి ఆ క్యాప్‌ను తీసేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా అమెరికాకు చెందిన పాప్ సింగర్ మరియా కేరి సైతం కేక పెట్టి బాటిల్ క్యాప్‌ను తీసేసిన విషయం తెలిసిందే.
#bottlecapchallenge #vithumauli #StarPravah #ajinkyaraut pic.twitter.com/fci29YRjOe
— Vaibhav Shetkar (@vaibhavshetkar) July 5, 2019
Challenge accepted! #bottletopchallenge pic.twitter.com/Rygijd6z5W
— Mariah Carey (@MariahCarey) July 7, 2019