పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు
పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 26వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ నెల 17 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానుండగా.. 20 నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. అలగే జూలై 5న బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ఎంపీలు 17, 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారని.. 19న స్పీకర్ ఎన్నిక జరగనుంది ఆయన […]

పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 26వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ నెల 17 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానుండగా.. 20 నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. అలగే జూలై 5న బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ఎంపీలు 17, 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారని.. 19న స్పీకర్ ఎన్నిక జరగనుంది ఆయన పేర్కొన్నారు. జూలై 20న రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని జవదేకర్ తెలిపారు.



