AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking : మళ్లీ గ్రే జాబితాలోనే పాకిస్థాన్ !

పాకిస్థాన్‌‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మళ్లీ  గ్రే జాబితాలో కొనసాగిస్తున్నట్లు  ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్  (ఎఫ్‌ఏటీఎఫ్)‌ వెల్లడించింది. 

Breaking : మళ్లీ గ్రే జాబితాలోనే పాకిస్థాన్ !
Ram Naramaneni
|

Updated on: Oct 23, 2020 | 8:14 PM

Share

పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మళ్లీ  గ్రే జాబితాలో కొనసాగిస్తున్నట్లు  ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్  (ఎఫ్‌ఏటీఎఫ్)‌ వెల్లడించింది.  శుక్రవారంతో ముగిసిన టాస్క్‌ఫోర్స్‌ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  2021 జూన్‌ వరకు పాకిస్థాన్‌ గ్రే లిస్టులోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. 2018 జూన్‌లో పాకిస్థాన్‌ను గ్రే జాబితాలో చేర్చింది ఎఫ్‌ఏటీఎఫ్.  గ్రే జాబితాలో ఉండే దేశాలకు ప్రపంచ బ్యాంకు సహా వివిధ అంతర్జాతీయ సంస్ధల నుంచి ఆర్థిక సాయం పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అసలే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న పాక్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి.  ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు పాకిస్థాన్‌పై ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు  మనీలాండరింగ్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు కూడా ఆ దేశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read :

కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

‘బాహుబ‌లి’ సినిమాకు వీరాభిమాని ఈ తైవాన్ మంత్రి

Follow Us