పుల్వామా దాడి గురించి కొట్టుకున్న పాక్ నేతలు

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి జరిగనప్పటి నుంచీ భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్య సమితికి కలగజేసుకోవాలంటూ లేఖ కూడా రాశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా స్పందిస్తూ పుల్వామా దాడికి పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. భారత్ ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడుకుంటూ పాకిస్థాన్‌లో నేతలు ఏకంగా […]

  • Vijay K
  • Publish Date - 6:21 pm, Thu, 21 February 19
పుల్వామా దాడి గురించి కొట్టుకున్న పాక్ నేతలు

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి జరిగనప్పటి నుంచీ భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్య సమితికి కలగజేసుకోవాలంటూ లేఖ కూడా రాశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా స్పందిస్తూ పుల్వామా దాడికి పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. భారత్ ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అయితే ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడుకుంటూ పాకిస్థాన్‌లో నేతలు ఏకంగా కొట్టేసుకున్నారు. ‘1టీవీ కాబూల్’ అనే పాక్ టీవీ ఛానల్ పుల్వామా ఘటనపై చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా చర్చలో నాయకుల మధ్య ఆవేశాలు బయటపడ్డాయి. మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో టీవీ చూస్తున్న అందరూ నివ్వెరపోయారు. ఛానల్ సిబ్బంది వచ్చి విడదీసేందుకు ప్రయత్నించినప్పటికీ మీదపడి మరీ కొట్టుకున్నారు. ఎట్టకేలకు వారిని విడిపించి గొడవను సద్దమణిగేలా చేశారు.