కరోనా ఎఫెక్ట్: నిబంధనలు పాటించని 800 మందికి జరిమానా..!
ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు నిబంధనలను ఉల్లంఘించిన

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. దాదాపు 800 మందికి పైగా ఉల్లంఘనులకు వరుసపెట్టి జరిమానాలు విధించారు.
వివరాల్లోకెళితే.. సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, మాస్క్ ధరించకపోవడం, పలు కారణాలపై శుక్రవారం నాడు 832 మందికి చలానాలు రాసినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 5,646 చలానాలు రాసినట్టు వెల్లడించారు. కాగా షెల్టర్ హోమ్స్ సహా పలు నివాస ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు స్వయంగా మాస్కులు కూడా పంపిణీ చేయడం విశేషం. ఢిల్లీ పోలీస్ విభాగం తరపున ఇప్పటి వరకు 25,134 మాస్కులు పంచిపెట్టినట్టు అధికారులు పేర్కొన్నారు.
Also Read: ఆన్‌లైన్ బోధనకోసం ‘విద్యాదాన్’



