ఆ వార్తలు నిజమే.. సంచలన విషయాలు వెల్లడించిన రియా
బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగా సుశాంత్ ప్రస్తుత లవర్‌గా చెప్పుకొనే నటి రియా చక్రవర్తిని గురువారం పోలీసులు విచారించారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగా సుశాంత్ ప్రస్తుత లవర్‌గా చెప్పుకొనే నటి రియా చక్రవర్తిని గురువారం పోలీసులు విచారించారు. దాదాపు 9 గంటల పాటు ఆమెను పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమెను వారు పలు ప్రశ్నలను సంధించినట్లు సమాచారం. అందులో రియా పలు కీలక విషయాలు వెల్లడించింది.
సుశాంత్, తాను రిలేషన్‌లో ఉన్నామని.. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని రియా వెల్లడించింది. లాక్‌డౌన్ సమయంలో సుశాంత్ ఇంట్లోనే ఉన్నానని.. అయితే వారిద్దరి మధ్య చిన్న గొడవ రావడంతో అక్కడి నుంచి తాను వచ్చేశానని రియా పేర్కొంది. అయినప్పటికీ సుశాంత్‌కు తాను ఫోన్, మెసేజ్‌లు చేసేదాన్నని ఆమె పోలీసులకు తెలిపింది.
ఇక సుశాంత్ డిప్రెషన్‌లో ఉన్నాడని, దానికి సంబంధించి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు క్లినికల్ ఫ్రూప్‌లు కూడా రియా పోలీసులకు చూపించినట్లు తెలుస్తోంది. అయితే మెడిసిన్‌ను ఆపేసిన సుశాంత్.. యోగా, ధ్యానం చేసేవాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే మరో షాకింగ్ విషయాన్ని రియా పోలీసులకు తెలిపింది. యశ్ రాజ్ సంస్థతో సుశాంత్ అగ్రిమెంట్ పూర్తైందని.. తనను కూడా యశ్‌రాజ్ అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసుకోమని చెప్పేవాడని రియా పేర్కొంది. ఇక రియా స్టేట్‌మెంట్‌ని పోలీసులు రికార్డు చేశారు. కాగా ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సుశాంత్.. చివరిసారిగా రియాకు, అతడి స్నేహితుడు మహేష్ శెట్టికి ఫోన్ చేశారు. అయితే వారిద్దరు ఫోన్ లిఫ్ట్ చేయలేదని పోలీసుల విచారణలో తేలింది.
Read This Story Also: వర్షసూచన.. ఏపీకి 5 రోజుల పాటు వర్షాలు



