AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమానుష ఘటన.. నిరాకరించిన పది ఆసుపత్రులు.. మహిళ మృతి

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఒకటి, రెండు కాదు ఏకంగా పది ఆసుపత్రులు ఓ మహిళను జాయిన్ చేసుకునేందుకు నిరాకరించాయి.

అమానుష ఘటన.. నిరాకరించిన పది ఆసుపత్రులు.. మహిళ మృతి
Ravi Kiran
|

Updated on: Jun 19, 2020 | 8:49 PM

Share

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఒకటి, రెండు కాదు ఏకంగా పది ఆసుపత్రులు ఓ మహిళను జాయిన్ చేసుకునేందుకు నిరాకరించాయి. దీంతో ఆమె ప్రాణాలు విడవగా.. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్‌కు చెందిన రోహిత అనే మహిళ గత కొద్దిరోజులుగా జ్వరం, జలుబు, ఆయాసంతో బాధపడుతోంది.

ఇక ఆమె ట్రీట్‌మెంట్‌ కోసం భర్త శ్రీకాంత్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది, ఆమెను చేర్చుకోవడం కుదరదని.. కరోనా రోగి అంటూ తిప్పి పంపించారు. ఇదే సమాధానం మరో పది ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి కూడా రావడంతో రోహితను తీసుకుని ఆమె భర్త శ్రీకాంత్ చివరికి గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. ఇక అక్కడ జాయిన్ చేసిన కొద్ది నిమిషాలకే ఆమె తుది శ్వాస విడిచింది. కాగా, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందంటూ శ్రీకాంత్ ఆరోపించాడు. అంతేకాకుండా రోహిత మృతిపై మానవ హక్కుల సంఘంలో పిటిషన్ కూడా వేశాడు.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత