AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రానికి అండగా నిలుద్దాం: కేసీఆర్

భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు వ్యుహాత్మకంగా వ్యవహరించాలని ప్రధానమంత్రికి సూచించారు.

కేంద్రానికి అండగా నిలుద్దాం: కేసీఆర్
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 19, 2020 | 8:18 PM

Share

ఇండో-చైనా సరిహద్దులో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు వ్యుహాత్మకంగా వ్యవహరించాలని ప్రధానమంత్రికి సూచించారు. దేశంలో రాజకీయాలు పక్కనబెట్టి యుద్ధనీతితో ఆలోచించాలన్నారు. సుస్థిర పాలనలో భారత్ ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలుదువ్వుతున్నదన్నారు సీఎం. మరోవైపు గాల్వన్ లోయలో వీర మరణం పొందిన సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి.ప్రధానమంత్రి నరేంద్రమోడి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

చైనా, పాకిస్తాన్ దేశాలు అంతర్గత సమస్యలు పక్కనబెట్టి సరిహద్దు దేశాలతో ఘర్షణ దిగడం పరిపాటిగా మారిందన్న సీఎం కేసీఆర్.. చైనా ఎప్పుడు భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతుందన్నారు. గాల్వన్ లోయ లాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయని గుర్తు చేశారు. 1957లో సరిహద్దు వివాదం లేవనెత్తి.. 1962లో ఏకంగా భారత్ – చైనా మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసింది. 1967లో కూడా సరిహద్దులో ఘర్షణ జరిగింది. అప్పుడు 200 మంది మృతి చెందరని గుర్తి చేసిన కేసీఆర్.. గాల్వన్ ఘర్షణలో 20 మంది మరణించారన్నారు. వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన దేశంతో ఎక్కడో ఓ చోట ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉంది. చైనాతో భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి వుందని.. భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉందని ముఖ్యమంత్రి సూచించారు.

సుస్థిర పాలనలో భాగంగా కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ.. పివోకె గురించి గట్టిగా మాట్లాడుతుండడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆక్సాయ్ చిన్ ను చైనా ఆక్రమించిందని పార్లమంట్ సాక్షిగా ప్రపంచానికి తెలిసేలా చేశామని.. దేశ రక్షణలో స్ట్రాటజిక్ పాయింట్ అయిన గాల్వన్ లోయలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడాన్ని చైనాకు మింగుడు పడటం లేకనే ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తున్నదన్నారు.

భారత్ శాంతికాముక దేశమైనప్పటికీ.. సహనానికి హద్దు ఉంటుందని, దేశ రక్షణ విషయంలో రాజీ పడవద్దని కేసీఆర్ సూచించారు. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయం అసన్నమైందన్న కేసీఆర్.. చైనాతో పాక్ , బంగ్లాదేశ్ దేశాలతో యుద్దాలు చేసిన అనుభవం మనకున్నదని గుర్తు చేశారు. 1970 ప్రాంతంలో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో ఇందిరాగాంధిని వాజ్ పేయి దుర్గామాత అని కొనియాడారు. ఇలాంటి సమయంలో దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఈ సమయంలో దేశ ప్రధానికి అండగా ఉంటారని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆర్థికంగా ప్రబల శక్తిగా భారత్ మారుతుండడాన్ని చైనా ఒడ్చుకోలేకపోతుందన్న కేసీఆర్.. అమెరికా 21 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక శక్తి అయితే, చైనా 14 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉంది. 5 ట్రిలియన్ డాలర్ల సంపద కలిగిన జపాన్ తో పాటుగా భారత్ కూడా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేయడం చైనా భరించలేక పోతున్నదన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు చైనాయే కారణమనే అపఖ్యాతితో పాటు భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా పెరుగుతుండడం చైనాకు నచ్చడం లేదని సిఎం కేసీఆర్ వివరించారు.

చైనా వస్తువులపై నిషేధం తొందరపాటు చర్య అవుతుందన్న సీఎం.. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాలన్నారు. రక్షణ వ్యవహారాలలో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించిన కేసీఆర్.. బ్రిటన్ ప్రతిపాదించిన డి 10 ఓరాన్ అలయెన్సులో చేరాలన్నారు హువాయ్ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కేసీఆర్ స్పష్టం చేశారు.