వర్షసూచన.. ఏపీకి 5 రోజుల పాటు వర్షాలు
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా కదులుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా కదులుతున్నాయి. దీంతో ఏపీలో 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు ఉత్తరాంధ్ర, యానం, దక్షిణాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం ఈ రోజు, రేపు ఉత్తర కోస్తా, ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. అటు రాయలసీమలోనూ మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయని అధికారులు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. జూన్ 22, 23 తేదీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
Read This Story Also: దారుణం.. 16 రోజుల పసికందును బావిలో పడేసిన దుండగులు



