AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శానిటైజర్ రాసుకుంటూ..స్టీరింగ్ వదిలేసిన బస్ డ్రైవర్..

కరోనా సృష్టిస్తున్న విలయం అంతాఇంతా కాదు.. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు, పాలకులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. వైరస్ బారినుంచి కాపాడుకునేందుకు మాస్క్‌లు, చేతులకు శానిటైజర్ రాసుకుంటూ పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతులకు శానిటైజర్ రాసుకునే క్రమంలో ఓ బస్సు డ్రైవర్ స్టిరింగ్ వదిలిపెట్టాడు..

శానిటైజర్ రాసుకుంటూ..స్టీరింగ్ వదిలేసిన బస్ డ్రైవర్..
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2020 | 8:17 PM

Share

కరోనా సృష్టిస్తున్న విలయం అంతాఇంతా కాదు.. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు, పాలకులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. కరోనా మహమ్మారి ఏ రూపంలో విరుచుకుపడుతుందో తెలియక ప్రజలు క్షణ క్షణం భయం భయంగా గడపాల్సిన దుస్థితి నెలకొంది. తప్పక మాస్క్ ధరించాలి, చేతులకు శానిటైజర్ రాసుకుంటూ పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతులకు శానిటైజర్ రాసుకునే క్రమంలో ఓ బస్సు డ్రైవర్ స్టిరింగ్ వదిలిపెట్టాడు. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో అరుపులు కేకలు పెట్టారు. ఈ సంఘటన వేములవాడ మండలం అగ్రహారం సమీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు పరిశీలించగా…

సిరిసిల్ల డిపోకు చెందిన నాన్‌స్టాప్‌ ఆర్టీసీ బస్సు శుక్రవారం కరీంనగర్‌ నుంచి సిరిసిల్లకు బయలుదేరింది. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని కరీంనగర్‌ పాల డెయిరీ వద్దకు రాగానే.. డ్రైవర్‌ స్టీరింగ్‌ విడిచి పెట్టి చేతులకు శానిటైజర్‌ రాసుకుంటున్నాడు. ఇంతలో బస్సు అదుపుతప్పి డివైడర్‌ మీదకు దూసుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపేశాడు. కాగా బస్సులో దాదాపు 20 మంది వరకు ఉన్నట్లు ప్రయాణికులు వెల్లడించారు. ప్రమాదం నుంచి బయటపడడంతో బస్సులో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
కోటి రూపాయల అప్పు ఉన్నా క్షణంలో తీరిపోవాలా.. పౌర్ణమి రోజు ఇలా..
కోటి రూపాయల అప్పు ఉన్నా క్షణంలో తీరిపోవాలా.. పౌర్ణమి రోజు ఇలా..
"ముందు మీ దేశాన్ని చూసుకోండి".. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
ఓటీటీలో రచ్చ చేస్తున్న సినిమా.. ఆ ఫ్యామిలీ దెబ్బకు అందరూ అవుట్..
ఓటీటీలో రచ్చ చేస్తున్న సినిమా.. ఆ ఫ్యామిలీ దెబ్బకు అందరూ అవుట్..
ఐరోపాలో నిప్పుల కొలిమి.. 9 రోజుల్లో 13 వేల మంది మృతి..
ఐరోపాలో నిప్పుల కొలిమి.. 9 రోజుల్లో 13 వేల మంది మృతి..
ఒకప్పుడు పొలాల్లో కూలి పని.. ఇప్పుడు నెలకు రూ.50 వేల సంపాదన..
ఒకప్పుడు పొలాల్లో కూలి పని.. ఇప్పుడు నెలకు రూ.50 వేల సంపాదన..
గుమ్మడి గింజలు అమృతం అనుకుంటే పొరపాటే.. ఎక్కువగా తింటే ఈ తీవ్రమైన
గుమ్మడి గింజలు అమృతం అనుకుంటే పొరపాటే.. ఎక్కువగా తింటే ఈ తీవ్రమైన
రజినీకాంత్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా నేను చేయాల్సింది..
రజినీకాంత్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా నేను చేయాల్సింది..
ఇక స్టోరేజ్ ఫుల్ తలనొప్పి ఉండదు.. జీమెయిల్‌లో దాగున్న ఈ సీక్రెట్
ఇక స్టోరేజ్ ఫుల్ తలనొప్పి ఉండదు.. జీమెయిల్‌లో దాగున్న ఈ సీక్రెట్