AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..!

Mayank Yadav Speed: హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత పేస్ సంచలనం మయాంక్ యాదవ్ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. మ్యాచ్‌లోని తొలి బంతికే వికెట్ తీసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ ఫాస్ట్ బౌలర్, అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన భారతీయ బౌలర్ల జాబితాలో చేరిపోయాడు.

Video: తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..!
Ind Vs Zim Mayank Yadav Speed
Venkata Chari
|

Updated on: Jul 23, 2026 | 6:40 PM

Share

Mayank Yadav Speed: జింబాబ్వే పర్యటనలో భాగంగా టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకున్న తరుణంలో, టీమిండియా పేస్ దళం బాధ్యతను మయాంక్ యాదవ్ తన భుజాలపై వేసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేయడానికి వచ్చిన మయాంక్, గంటకు 149 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ లాంటి బంతిని సంధించాడు. ఆఫ్‌ స్టంప్‌కు వెలుపల పడి కొద్దిగా దూసుకెళ్లిన ఆ బంతిని ఆడబోయిన జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ బ్యాట్‌ను తాకుతూ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతుల్లోకి వెళ్లింది. మైదానంలో అంపైర్ నాటౌట్ ప్రకటించినప్పటికీ, కీపర్ కిషన్ ఇచ్చిన గట్టి నమ్మకంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రివ్యూ కోరాడు. అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా తేలడంతో బెన్నెట్‌ను డక్‌గా పెవిలియన్‌కు చేరాడు.

అంతర్జాతీయ టీ20ల్లో ఎలైట్ జాబితాలో మయాంక్..!

ఈ వికెట్‌తో మయాంక్ యాదవ్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన మూడో భారతీయ బౌలర్‌గా అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ (2024 టీ20 ప్రపంచకప్‌లో యూఎస్ఏపై), హార్దిక్ పాండ్యా (2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై) ఈ ఘనత సాధించారు. అంతేకాకుండా, టీ20 కెరీర్‌లో మయాంక్‌కు ఇలా తొలి బంతికే వికెట్ దక్కడం ఇది రెండవసారి కావడం విశేషం. గతంలో 2024 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లోనూ పర్వేజ్ హొసేన్ ఇమోన్‌ను మయాంక్ తొలి బంతికే పెవిలియన్‌కు పంపాడు.

వేగంతో పాటు అద్భుతమైన నియంత్రణ..!

తొలి ఓవర్‌ నుంచే తనదైన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన మయాంక్, కేవలం వేగం మాత్రమే కాకుండా అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌ను ప్రదర్శించాడు. సగటున 144.5 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు విసిరిన ఈ స్పీడ్ గన్, జట్టుకు అరుదైన బ్రేక్ త్రూ అందించాడు. ఈ ఆరంభం భారత్‌లో నూతన పేస్ యుగానికి నిదర్శనంగా నిలుస్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మయాంక్ యాదవ్ వేసిన ఆ ఒక్క అద్భుతమైన బంతి భారత్‌కు కలసివచ్చే ఆరంభాన్ని అందించింది. భవిష్యత్తులో టీమిండియా పేస్ అటాక్‌ను ముందుండి నడిపించే సత్తా తనకు ఉందని ఈ యువ సంచలనం మరోసారి నిరూపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు
ఉత్తరాంధ్ర వాసులకు సర్కార్ గుడ్ న్యూస్..!
ఉత్తరాంధ్ర వాసులకు సర్కార్ గుడ్ న్యూస్..!
యముడి నుంచి ఫోన్.. కనెక్ట్ కాకపోవడంతో బతికిపోయిన బైకర్..
యముడి నుంచి ఫోన్.. కనెక్ట్ కాకపోవడంతో బతికిపోయిన బైకర్..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే
తొలి ఓవర్‌లోనే 147 కిలోమీటర్ల స్పీడ్‌తో అదరగొట్టాడుగా..!
తొలి ఓవర్‌లోనే 147 కిలోమీటర్ల స్పీడ్‌తో అదరగొట్టాడుగా..!
థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టిన సినిమా.. ఇప్పుడు టీవీలో..
థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టిన సినిమా.. ఇప్పుడు టీవీలో..
మీరు అతిగా టీ తాగుతారా?అయితే మీ క్యారెక్టర్ ఇదే!
మీరు అతిగా టీ తాగుతారా?అయితే మీ క్యారెక్టర్ ఇదే!