AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: నాగ్ సార్.. నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. హైదరాబాద్‌కు పాదయాత్రగా మంచిర్యాల ఆటో డ్రైవర్

బుల్లితె ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి అన్నీ భాషల్లోనూ ఒకేసారి బిగ్ బాస్ షో లాంఛ్ కానుంది. ఇక తెలుగులో ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి మరిన్ని హంగులు ఉండనున్నాయని తెలుస్తోంది.

Bigg Boss Telugu 10: నాగ్ సార్.. నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. హైదరాబాద్‌కు పాదయాత్రగా మంచిర్యాల ఆటో డ్రైవర్
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Jul 23, 2026 | 6:48 PM

Share

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాళం, తమిళం.. ఇలా ప్రధాన భాషల్లోనూ ఒకేసారి ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇక తెలుగులో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా తొమ్మిది సీజన్లు పూర్తయ్యాయి. ల్యాండ్ మార్క్ సీజన్ కోసం ఇప్పటికే అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చే జరుగుతోంది. పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లతో పాటు సామాన్యులు కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అగ్ని పరీక్ష ఆడిషన్స్ ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ రియాలిటీ లో తమకూ అవకాశం కల్పించాలని చాలా మంది కోరుతున్నారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా కంటెస్టెంట్స్ గా తమకూ ఛాన్స్ ఇప్పించాలని తమదైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాలకు చెందిన ఒక యువకుడు తనకు బిగ్ బాస్ లో అవకాశం కల్పించాలంటూ ఏకంగా పాదయాత్ర చేపట్టాడు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన తుడుం నాగార్జున ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ షోలో తనకూ అవకాశం కల్పించాలని కోరుతూ కవ్వాల్ గ్రామం నుంచి హైదరాబాదుకు పాదయాత్ర చేపట్టాడు నాగార్జున. ఈ నెల 17న ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇప్పుడు మంచిర్యాల జిల్లా దాటి కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించింది. బిగ్ బాస్, నాగార్జున ఫ్లెక్సీ పట్టుకుని రోడ్డుపై వెళుతోన్న నాగార్జునను చూసి ప్రతి ఒక్కరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘నేను ఎన్నిసార్లు విఫలమైనప్పటికీ బిగ్ బాస్ కోసం పాదయాత్ర చేస్తుంటాను. బిగ్ బాస్ ఆడడమే నా లక్ష్యం. నాకు ఎప్పటి నుంచో ఈ కోరిక ఉంది. గత 5 సంవత్సరాలుగా నేను ఈ రియాలిటీ షో లో పాల్గొనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. నాగార్జునను కలిసేందుకు ఇలా పాదయాత్రలు చేస్తూనే ఉన్నాను. కానీ విఫలమవుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్ని పరీక్షకు అప్లై చేసుకున్నాను. బిగ్ బాస్ షోలో వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తులకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న నాకు బిగ్ బాస్ షోలో ఛాన్స్ కల్పించాలి’ అని నాగార్జున కోరుతున్నాడు.

కాగా అదిలా బాద్ నుంచి హైదరాబాద్ సుమారు 270 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరి బిగ్ బాస్ ఛాన్స్ కోసం ఈ దూరాన్ని సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్నాడు నాగార్జున. మరి బిగ్ బాస్ లో అతనికి అవకాశం వస్తుందా? రాదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us