ఏపీలో ఇద్దరు కొత్త మంత్రులు.. జగన్ మనసులో వున్నది వీరే
రాజ్యసభలో అడుగుపెట్టే ముందే తమ మంత్రి పదవులకు వారిద్దరు రాజీనామా చేయాల్సి వుంటుంది. సో.. పెద్దల సభకు ఎన్నికయ్యామన్న ఆనందంతోపాటు మంత్రిపదవులకు దూరమవుతున్న ఖేదం వారిద్దరిలో ఉండక తప్పని పరిస్థితి...

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పోటీ చేసిన నాలుగు సీట్లను దక్కించుకుంది. వారిలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావుతోపాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ విజయాన్ని దక్కించుకున్నారు. అయితే వీరిలో మంత్రులుగా కొనసాగుతున్న ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఎంపీలుగా రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. రాజ్యసభలో అడుగుపెట్టే ముందే తమ మంత్రి పదవులకు వారిద్దరు రాజీనామా చేయాల్సి వుంటుంది. సో.. పెద్దల సభకు ఎన్నికయ్యామన్న ఆనందంతోపాటు మంత్రిపదవులకు దూరమవుతున్న ఖేదం వారిద్దరిలో ఉండక తప్పని పరిస్థితి.

ఇదిలావుంటే వీరి స్థానంలో ఎవరు రానున్నారనేది ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అయితే ఈ స్థానాల్లో ఎవరిని తీసుకోవాలని అనే అంశంపై ముఖ్యమంత్రి జగన్ క్లారిటీతో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి పేర్లను కూడా ఇప్పటికే సీఎం జగన్ రెడీ చేసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీలుగా ఎన్నిక కావటంతో వారి స్థానాలను బీసీ వర్గానికి చెందిన వారికే కేటాయించే యోచనలో సీఎం జగన్ ఉన్నారనే చర్చ సాగుతోంది.
ఈ రెండు మంత్రి పదవులను మోపిదేవి, పిల్లి సామాజిక వర్గాలకు, అదే జిల్లాలకు కేటాయిస్తారా.. ? లేక కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా ..? అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే సీఎం జగన్ ఎవరికి హామీ ఇవ్వలేదని…అయితే సీఎం తనకు సన్నిహితంగా ఉండే పార్టీ సీనియర్ నాయకులతో చర్చించినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ఓ యువ ఎమ్మెల్యేకు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ ఇద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేసిన తరువాతే… ఈ పదవులు ఎవరికి దక్కుతాయనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మరికొందరు చర్చించుకుంటున్నారు.




