ఢిల్లీ డీసీపీకి కరోనా పాజిటివ్.. ముగ్గురు సిబ్బందికి హోం ఐసోలేషన్..

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ విభాగంలో ఓ డీసీపీకి కరోనా

ఢిల్లీ డీసీపీకి కరోనా పాజిటివ్.. ముగ్గురు సిబ్బందికి హోం ఐసోలేషన్..
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 19, 2020 | 9:17 PM

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ విభాగంలో ఓ డీసీపీకి కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. డీసీపీ కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేయడంతో పాటు ఆయన కింద పనిచేసే ముగ్గురు సిబ్బందిని హోం ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు.

అయితే.. డీసీపీకి కోవిద్-19 ఎలా సోకిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఇటీవల కొవిడ్-19 బారిన పడిన ఓ ఏసీపీ ర్యాంకు అధికారి ద్వారా వైరస్ వ్యాపించినట్టు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులకు కూడా కరోనా సోకింది. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీలో దాదాపు 800 మంది పోలీసులు ఈ మహమ్మారి బారిన పడ్డారు.

Also Read: ఆన్‌లైన్‌ బోధనకోసం ‘విద్యాదాన్’

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu