విశ్వభారతి విశ్వవిద్యాలయ విధ్వంసం : సీఎం మ‌మ‌త‌కు గ‌వ‌ర్న‌ర్ ఘాటు లేఖ‌

పశ్చిమ్ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌ జిల్లా విశ్వభారతి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త‌త చెల‌రేగిన సంగతి తెలిసిందే. యూనివ‌ర్శిటీకి చెందిన గ్రౌండ్ చుట్టూ గోడ కట్టడాన్ని వ్య‌తిరేకిస్తూ నాలుగు వేల మంది స్థానికులు విధ్వంసానికి పాల్పడ్డారు.

విశ్వభారతి విశ్వవిద్యాలయ విధ్వంసం : సీఎం మ‌మ‌త‌కు గ‌వ‌ర్న‌ర్ ఘాటు లేఖ‌
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 19, 2020 | 4:40 PM

పశ్చిమ్ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌ జిల్లా విశ్వభారతి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త‌త చెల‌రేగిన సంగతి తెలిసిందే. యూనివ‌ర్శిటీకి చెందిన గ్రౌండ్ చుట్టూ గోడ కట్టడాన్ని వ్య‌తిరేకిస్తూ నాలుగు వేల మంది స్థానికులు విధ్వంసానికి పాల్పడ్డారు. ప్ర‌తి సంవ‌త్స‌రంలో ఆ గ్రౌండ్‌లో శీతాకాలంలో పోస్‌ మేళా జరుగుతుంది. గోడ కడితే గ్రౌండ్‌లోకి అడుగుపెట్టేందుకు అవకాశం కూడా ఉండదన్న ఆందోళనతో స్థానికులు యూనివ‌ర్శిటీ ఆస్తులపై దాడులకు తెగ‌బ‌డ్డారు. గోడ పనులకు అడ్డుకున్నారు. జేసీబీ ఉప‌యోగించి మీర‌ గేట్లను కూలదోశారు.

కాగా ఈ విధ్వంసానికి సంబంధించి తృణమూల్ ఎమ్మెల్యేపై పోలీసులు ఈ రోజు కేసు నమోదు చేశారు. ఇక‌ ఈ హింస‌కు సంబంధించి గవర్నర్ జగదీప్ ధంకర్ ఈ సాయంత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు.ఈ విధ్వంసం ముందుగానే ప్లాన్ చేసిన‌ట్లు అనిపిస్తుంద‌ని పేర్కొన్నారు. ఇది అంతా కుట్ర ప్ర‌కారం జ‌రిగిన‌ట్టే అనిపిస్తుంద‌ని, దాడి చేసిన‌వారికి క‌నీసం భ‌యం కూడా లేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. “ప్రతి సమాజం త‌ప్పు, ఒప్పు మధ్య ఎర్రటి గీతను గీస్తుంది. ఒక తప్పు గుర్తించబడాలి, శిక్షించబడాలి. అది మ‌రోసారి పునరావృతం కాకుండా చూడాలి” అని ఆయన లేఖ‌లో పేర్కొన్నారు.

Also Read :

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్‌టాప్‌లో బంధించిన తండ్రి

క‌రోనా వ‌చ్చి, త‌గ్గాక లైట్ తీసుకోవ‌ద్దు : నీతి ఆయోగ్ స‌భ్యుడి హెచ్చ‌రిక‌