పీపీఈ కిట్ ధరించి, రూ.13 కోట్ల జువెల్లరీ దొంగిలించి పరారయ్యాడు.. సీసీటీవీ కెమెరాలో బుక్కయ్యాడుగా ! పేరు కూడా తెలిసిపోయింది

ఢిల్లీలో ఓ వ్యక్తి దర్జాగా పీపీఈ కిట్ ధరించి ఓ జువెల్లరీ షాపులోకి చొరబడ్డాడు. లాఘవంగా రూ. 13 కోట్ల విలువైన బంగారు నగలను దొంగిలించుకుపోయాడు.

  • Umakanth Rao
  • Publish Date - 3:02 pm, Thu, 21 January 21
పీపీఈ కిట్ ధరించి, రూ.13 కోట్ల జువెల్లరీ దొంగిలించి పరారయ్యాడు.. సీసీటీవీ కెమెరాలో బుక్కయ్యాడుగా ! పేరు కూడా తెలిసిపోయింది

ఢిల్లీలో ఓ వ్యక్తి దర్జాగా పీపీఈ కిట్ ధరించి ఓ జువెల్లరీ షాపులోకి చొరబడ్డాడు. లాఘవంగా రూ. 13 కోట్ల విలువైన బంగారు నగలను దొంగిలించుకుపోయాడు. ఈ ఘరానా దొంగ తనను గుర్తు పట్టకుండా పీపీఈ కిట్ ధరిస్తే ఏం? ఇతడిని మహమ్మద్ షేక్ నూర్ గా గుర్తించారు. ఇతని చోరీ ఎంచక్కా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ జువెల్లరీ షో రూమ్ పక్కనున్న భవనం టెర్రేస్ పై నుంచి నేర్పుగా దూకి ఈ షో రూమ్ లోకి ఎంటరయ్యాడని తెలిసింది. ఆ సమయంలో 5గురు సాయుధ గార్డులు ఉన్నప్పటికీ గురువారం తెల్లవారే వరకు తెలియలేదంటే మహమ్మద్ ఎంత గప్ చుప్ గా చోరీ చేసాడో తెలుస్తోంది. కర్నాటక లోని హుబ్లీకి చెందిన ఇతడు దక్షిణ ఢిల్లీలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాపులో పని చేస్తున్నాడట.. మొత్తం 25 కేజీల బంగారాన్ని దోచుకుని ఓ ఆటోలో పారిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో అతడిని పట్టుకుంటామని చెబుతున్నారు.


Read Also:పీపీఈ కిట్‌ ధరించి రోడ్డుపై వచ్చిన వ్యక్తి.. జనాలు పరుగో పరుగు.
Read Also :రెండు వర్గాల మధ్య రాళ్లు, కట్టెలతో పరప్పర దాడులు.. తీవ్ర గాయాలతో చికిత్సపొందుతూ ఒకరు మృతి.