హైదరాబాద్ శివారులో ఓటుందా? పదివేలిస్తాం రండి..!

తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల ఫుణ్యమా అని దేశంలోనే రికార్డు స్థాయికి చేరిపోతోంది ఓటు రేటు. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారులోని కొత్త మునిసిపాలిటీల్లో ఓటు రేటు అదిరిపోతోంది. వివిధ పార్టీల తరపున బరిలో దిగిన వారితోపాటు మందీ మార్బలం దండిగా వున్న వారు పెద్ద సంఖ్యలో మునిసిపల్ బరిలోకి దిగడంతో ఓటరన్నకు డిమాండ్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. నగర శివారులో కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల పరిధిలో బాగా పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ దందాలో బాగా సంపాదించిన వారు.. […]

హైదరాబాద్ శివారులో ఓటుందా? పదివేలిస్తాం రండి..!
Follow us

|

Updated on: Jan 17, 2020 | 6:58 PM

తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల ఫుణ్యమా అని దేశంలోనే రికార్డు స్థాయికి చేరిపోతోంది ఓటు రేటు. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారులోని కొత్త మునిసిపాలిటీల్లో ఓటు రేటు అదిరిపోతోంది. వివిధ పార్టీల తరపున బరిలో దిగిన వారితోపాటు మందీ మార్బలం దండిగా వున్న వారు పెద్ద సంఖ్యలో మునిసిపల్ బరిలోకి దిగడంతో ఓటరన్నకు డిమాండ్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. నగర శివారులో కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల పరిధిలో బాగా పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ దందాలో బాగా సంపాదించిన వారు.. వారి ఫ్యూచర్ అవసరాల కోసం మునిసిపల్ ఎన్నికల బరిలోకి దిగారు. వారంతా తాము అడ్డగోలుగా సంపాదించిన డబ్బును ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యధేచ్ఛగా వెదజల్లుతున్నారని సమాచారం.

తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన బిల్డర్లు, రియల్టర్లు ఎంతైనా ఖర్చు పెట్టి గెలవాలన్న పట్టుదలతో డబ్బులు వెదజల్లుతున్నారని చెప్పుకుంటున్నారు. మునిసిపాలిటీల్లో బలంగా వుంటే భవిష్యత్తులో భూములకు, లేఅవుట్లకు, నిర్మాణ అనుమతులకు ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం వుండదన్న ఉద్దేశంతో ఎంతైనా ఖర్చు చేసేందుకు వీరు సిద్దపడుతున్నారని చెప్పుకుంటున్నారు. ముందుగా కౌన్సిలర్లుగాను, కార్పొరేటర్లుగాను గెలిస్తే.. ఆ తర్వాత మేయర్ పదవి కోసం కోట్లు గుమ్మరించేందుకు మరికొందరు సిద్దపడుతున్నారని అంటున్నారు.

శివారు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒక్కోవార్డుకు 2 వేల నుంచి 2500 సరాసరి ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒక వెయ్యి ఓట్లను టార్గెట్‌ చేసుకుంటే ఈజీగా గెలవచ్చని అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. దాని కోసం 50 లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. వెయ్యి ఓట్ల కోసం కోటి రూపాయలు.. అంటే ఒక్కో ఓటుకు రేటు పది వేల రూపాయలన్నమాట. గతంలో ఓటుకు వేయి, రెండు వేలు ఇవ్వడం చూశాం. తాజాగా ఓటు రేటు అయిదు రెట్లు అయ్యిందని చెప్పుకుంటున్నారు.

అధికార పార్టీ నుంచి రెబెల్స్‌, ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల దాకా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ అన్నట్లుగా సూట్‌కేసుల నిండా నోట్ల కట్టలు బయటకు తీసుతున్నారు. వెయ్యి ఓట్లను కొంటే చాలు కార్పొరేటర్‌ అవ్వొచ్చు. హోదా ఉంటుంది, తమ పనులు చక్క బెట్టుకోవచ్చు అనేది రియల్‌ నయా నేతల ఆలోచన. ఇందు కోసం ఎంతైనా ఖర్చు చేయాలన్న కసితో కనిపిస్తున్నారు కొత్త నేతలు.

భారత రాజకీయాల్లో ఈ స్థాయి ఖర్చు ఎక్కడ జరిగిన దాఖలు లేవు. ఇది ఎక్కడికి దారితీస్తుందో అని విశ్లేషకులు భయపడుతున్నారు. ఈ రిచ్‌ పాలిటిక్స్‌తో దశాబ్దాలుగా పార్టీల జెండా మోసిన నేతలంతా తెరుమరుగైపోతున్నారు. పుల్‌టైమ్ పొలిటిషయన్స్‌ ఈ ఖరీదైన రాజకీయాలను తట్టుకోలేక పోటీకి దూరంగా ఉంటున్నారు. పార్టీలు కూడా డబ్బులు పెట్టే నేతలకే టికెట్లు ఇస్తున్నాయి. దాంతో ఓటు రేటు పెరుగుతోంది. నయా ట్రెండ్‌లో జోష్ కనిపిస్తోంది.