AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్కే బీచ్‌లో అదిరిపోతున్న ఏర్పాట్లు

ఏపీ ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని విశాఖ సాగరతీరంలో నిర్వహించనుంది. ఆర్కే బీచ్‌ రోడ్డులో రిపబ్లిక్‌ డే పరేడ్‌ ప్రాక్టీస్‌ను నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకలకు సీఎం వైఎస్‌ జగన్‌, గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరవుతారు. రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 14 కమిటీలు వేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రిపబ్లిక్‌ డే రోజు పరేడ్‌లో పాల్గొనే కంటెంజెంట్స్ బీచ్‌ రోడ్డులో సన్నద్ద కవాతు నిర్వహించారు. 8 కంటెంజెంట్స్ ఇప్పటికే విశాఖకు […]

ఆర్కే బీచ్‌లో అదిరిపోతున్న ఏర్పాట్లు
Rajesh Sharma
|

Updated on: Jan 17, 2020 | 5:46 PM

Share

ఏపీ ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని విశాఖ సాగరతీరంలో నిర్వహించనుంది. ఆర్కే బీచ్‌ రోడ్డులో రిపబ్లిక్‌ డే పరేడ్‌ ప్రాక్టీస్‌ను నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకలకు సీఎం వైఎస్‌ జగన్‌, గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరవుతారు. రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 14 కమిటీలు వేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు రిపబ్లిక్‌ డే రోజు పరేడ్‌లో పాల్గొనే కంటెంజెంట్స్ బీచ్‌ రోడ్డులో సన్నద్ద కవాతు నిర్వహించారు. 8 కంటెంజెంట్స్ ఇప్పటికే విశాఖకు చేరుకొని రిహార్సల్స్ ప్రారంభించాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా విశాఖలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలి రిపబ్లిక్‌ డే వేడుకలు కూడా విశాఖలోనే నిర్వహిస్తుండటం విశేషం.

రిపబ్లిక్‌ డే వేడుకల నేపధ్యంలో జనవరి 17 నుంచి ఈనెల 25 వరకు బీచ్‌రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బీచ్‌ రోడ్డులో ఉదయం 5.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రిపబ్లిక్‌ డే పరేడ్‌ ప్రాక్టీస్‌ చేయడం జరుగుతుంది. అందువల్ల ఆయా సమయాల్లో బీచ్‌రోడ్డులో ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు. ఆర్కే బీచ్‌ ఏరియాలో నివాసముండే వాళ్లకు రాకపోకల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆర్కే బీచ్‌ పరిసర ప్రాంతవాసులకు త్రీ టౌన్‌ పోలీసులు రెసిడెన్షియల్‌ పాస్‌లను అందజేస్తున్నారు.

SBI రుణ రేట్లు తగ్గింపు.. గృహ, వ్యక్తిగత లోన్స్‌ చౌకగా.. EMIలో..
SBI రుణ రేట్లు తగ్గింపు.. గృహ, వ్యక్తిగత లోన్స్‌ చౌకగా.. EMIలో..
ఆడవాళ్లకు భరోసాగా బెంగళూరు ఆటో డ్రైవర్స్.. ఆ ఒక్క మెసేజ్‌తో..
ఆడవాళ్లకు భరోసాగా బెంగళూరు ఆటో డ్రైవర్స్.. ఆ ఒక్క మెసేజ్‌తో..
సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. స్పెషల్ ట్రైన్స్‌ ఇవే
సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. స్పెషల్ ట్రైన్స్‌ ఇవే
కాలేయ సమస్యలకు సంజీవని చేప నూనె.. బెనిఫిట్స్ తెలిస్తే వదలిపెట్టరు
కాలేయ సమస్యలకు సంజీవని చేప నూనె.. బెనిఫిట్స్ తెలిస్తే వదలిపెట్టరు
చూశారా ఈ చిత్రం.! ఇకపై ఫోన్ చేస్తున్నవారి పేరు మీ స్క్రీన్‌పైనే..
చూశారా ఈ చిత్రం.! ఇకపై ఫోన్ చేస్తున్నవారి పేరు మీ స్క్రీన్‌పైనే..
ఈ వ్యక్తులకు క్యారెట్ విషంతో సమానం.. తింటే బాడీ షెడ్డుకే..
ఈ వ్యక్తులకు క్యారెట్ విషంతో సమానం.. తింటే బాడీ షెడ్డుకే..
స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్.. పాఠశాలలకు సెలవులు!
స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్.. పాఠశాలలకు సెలవులు!
అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి.?నిర్లక్ష్యం చేస్తే
అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి.?నిర్లక్ష్యం చేస్తే
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు
భారత శాస్త్రవేత్తల అద్భుత సృష్టి..
భారత శాస్త్రవేత్తల అద్భుత సృష్టి..