AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ హైకోర్టు విషయంలో జగన్ ప్లాన్ ఇదే

ఏపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసే ఛాన్స్ వుందన్న ముఖ్యమంత్రి జగన్ అందుకు అనుగుణంగా భారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకున్న సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి లోతైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి హైదరాబాద్ హైకోర్టును విభజించేందుకు సుప్రీంకోర్టు చాలా కాలమే తీసుకుంది. ఆ తర్వాత భవనాలను చూపించిన తర్వాతనే హైకోర్టు విభజనకు అంగీకరించింది. దాంతో అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటైంది. అయితే, ఇపుడు కర్నూలును జ్యూడిషియల్ క్యాపిటల్ చేయడం అంత […]

ఏపీ హైకోర్టు విషయంలో జగన్ ప్లాన్ ఇదే
Rajesh Sharma
|

Updated on: Jan 18, 2020 | 5:12 PM

Share

ఏపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసే ఛాన్స్ వుందన్న ముఖ్యమంత్రి జగన్ అందుకు అనుగుణంగా భారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకున్న సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి లోతైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి హైదరాబాద్ హైకోర్టును విభజించేందుకు సుప్రీంకోర్టు చాలా కాలమే తీసుకుంది. ఆ తర్వాత భవనాలను చూపించిన తర్వాతనే హైకోర్టు విభజనకు అంగీకరించింది. దాంతో అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటైంది.

అయితే, ఇపుడు కర్నూలును జ్యూడిషియల్ క్యాపిటల్ చేయడం అంత ఈజీగా రాష్ట్ర హైకోర్టును ఆ నగరానికి తరలించే అవకాశం వుందా? అంటే న్యాయకోవిదులు లేదనే చెబుతున్నారు. హైకోర్టును తరలించాలన్నా.. లేదా బెంచీలను వేరే చోట ఏర్పాటు చేయాలన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. మరి అమరావతిలో ఇప్పుడిప్పుడే సెటిలవుతున్న హైకోర్టును మూడుగా విభజించి, ప్రధాన భాగాన్ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు సీజెఐ కార్యాలయం అంత ఈజీగా కన్విన్స్ అవుతుందా? అంటే కాదన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో జగన్ యాక్షన్ ప్లాన్ గురించి ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

రాజధానిని వికేంద్రీకరించేందుకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేయడం లేదా ప్రత్యేక బిల్లును చేయడం.. దాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు నివేదించి హైకోర్టు తరలింపు లేదా విభజనకు అనుమతి తీసుకోవడం ద్వారా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సీజెఐ అసెంబ్లీ తీర్మానానికి లేదా బిల్లుకు ఆమోదం తెలుపుతారని జగన్ భావిస్తున్నారు.

ఒకవేళ సీజెఐ ఆమోదం తెలపకపోతే.. హైకోర్టు హెడ్ క్వార్టర్స్ అమరావతిలోనే వుంచి.. కర్నూలులో రెండు కానీ, మూడు కానీ హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయడం, విశాఖలో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం వంటి ప్రత్యామ్నాయాలతోను ముఖ్యమంత్రి రెడీగా వున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద తమ కార్యాచరణకు లీగల్‌గా ఎలాంటి అవాంతరాలు రాకుండా లోతైన సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది.

Follow Us
రంగం సినిమాను మిస్సైన హీరో ఎవరో తెలుసా.. ?
రంగం సినిమాను మిస్సైన హీరో ఎవరో తెలుసా.. ?
ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? హీరో మెటీరియల్.. కానీ
ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? హీరో మెటీరియల్.. కానీ
రేయ్ ఏంట్రా ఇది.. ఉత్తుత్తి కోర్టు పెట్టి తీర్పులు కూడా ఇచ్చేశారు
రేయ్ ఏంట్రా ఇది.. ఉత్తుత్తి కోర్టు పెట్టి తీర్పులు కూడా ఇచ్చేశారు
అల్యూమినియం vs ఇత్తడి.. వంటకు ఏ పాత్రలు వాడితే ఆరోగ్యం? నిపుణులు
అల్యూమినియం vs ఇత్తడి.. వంటకు ఏ పాత్రలు వాడితే ఆరోగ్యం? నిపుణులు
వాట్సప్‌లో రీఛార్జ్ ఆప్షన్.. ఒక్క క్లిక్‌తో సెకన్లలోనే ప్రాసెస్..
వాట్సప్‌లో రీఛార్జ్ ఆప్షన్.. ఒక్క క్లిక్‌తో సెకన్లలోనే ప్రాసెస్..
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..