AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK: 18 ఏళ్ల అనుబంధానికి వీడ్కోలు.. సీఎస్కే హెడ్ కోచ్ ప‌ద‌వికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై..!

CSK Head Coach Exits: క్రికెట్ లీగ్‌లలో ఒక కోచ్ ఇన్నేళ్ల పాటు ఒకే జట్టుతో కొనసాగడం దాదాపు అసాధ్యం. అలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న స్టీఫెన్ ఫ్లెమింగ్ యుగం ముగియడం సీఎస్‌కే అభిమానులకు కాస్త బాధ కలిగించే విషయమే. అయితే, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు, సరికొత్త వ్యూహాలతో జట్టును పునర్నిర్మించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త కోచ్‌తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించక తప్పదు.

CSK: 18 ఏళ్ల అనుబంధానికి వీడ్కోలు.. సీఎస్కే హెడ్ కోచ్ ప‌ద‌వికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై..!
Csk Parts Ways With Stephen Fleming
Venkata Chari
|

Updated on: Jul 13, 2026 | 1:25 PM

Share

CSK Head Coach Exits: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత విజ‌య‌వంత‌మైన గురు-శిష్యుల బంధానికి తెర‌ప‌డింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) పాలిక కీ రోల్‌గా మారిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎట్టకేలకు జ‌ట్టుతో త‌న 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి పలికారు. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యంతో జరిపిన చర్చల అనంతరం ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఎల్లో ఆర్మీతో ముగిసిన సుదీర్ఘ ప్రయాణం..

ఐపీఎల్ ఆరంభమైన 2008 సీజన్ నుండి స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో విడదీయరాని బంధం ఉంది. మొదటి ఏడాది ఆటగాడిగా బరిలోకి దిగిన ఆయన, ఆ మరుసటి సంవత్సరమే అంటే 2009లో జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు క్లిష్ట సమయాల్లోనూ జట్టును ముందుండి నడిపించారు. “క్రీడా ప్రపంచంలో 18 ఏళ్లు అనేది ఒక జీవితకాలంతో సమానం. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు, మరెన్నో చారిత్రాత్మక విజయాలతో ఈ ప్రయాణాన్ని ముగిస్తున్నందుకు గర్వంగా ఉంది” అని ఫ్లెమింగ్ భావోద్వేగ ప్రకటన చేశారు.

ఇవి కూడా చదవండి

ధోని-ఫ్లెమింగ్.. ఐపీఎల్ చరిత్రలోనే ఐకానిక్ జోడీ..

క్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోని, స్టీఫెన్ ఫ్లెమింగ్ జోడీకి ప్రత్యేక స్థానం ఉంది. మైదానంలో ధోని వ్యూహాలు, మైదానం వెలుపల ఫ్లెమింగ్ ప్రణాళికలు చెన్నై జట్టును తిరుగులేని శక్తుగా మార్చాయి. వీరిద్దరి కాంబినేషన్‌లోనే సీఎస్‌కే ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడింది. కేవలం ట్రోఫీలే కాకుండా, రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20 కప్‌లను సైతం ఖాతాలో వేసుకుంది. రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్, 10 సార్లు ఫైనల్స్ చేరిన ఏకైక జట్టుగా చెన్నై నిలవడంలో వీరిద్దరి పాత్ర మరువలేనిది.

వరుస వైఫల్యాలు.. తప్పనిసరి పరిస్థితులు..

గత కొంతకాలంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. గత మూడు సీజన్లుగా జట్టు వరుసగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటోంది. వయసు పైబడిన ఆటగాళ్లపైనే అతిగా ఆధారపడటం, క్లిష్ట సమయాల్లో సరైన ప్రణాళికలు లేకపోవడం వంటి కారణాల వల్ల జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దీనికి తోడు గత సీజన్లలో ధోని ఫిట్‌నెస్ సమస్యలు, గాయాల చుట్టూ నడిచిన సస్పెన్స్ జట్టు సమతుల్యతను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలోనే యాజమాన్యం, ఫ్లెమింగ్ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

సీఎస్‌కే గుండెచప్పుడు ఫ్లెమింగ్: రూపా గురునాథ్

స్టీఫెన్ ఫ్లెమింగ్ వీడ్కోలుపై ఫ్రాంచైజీ యజమాని రూపా గురునాథ్ స్పందిస్తూ.. “మా కోచింగ్ విభాగానికి ఫ్లెమింగ్ ఒక గుండెచప్పుడు లాంటివారు. జట్టుకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, క్రమశిక్షణను తీసుకురావడంలో ఆయన కృషి అమూల్యమైనది. మైదానంలో మా బంధం ముగిసినా, ఆయన ఎప్పటికీ సీఎస్‌కే కుటుంబంలో భాగమే” అని కొనియాడారు. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ సైతం ఫ్లెమింగ్ నాయకత్వ పటిమను, ఆటగాళ్ల నుండి ఉత్తమ ప్రతిభను రాబట్టే ఆయన శైలిని అభినందించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us