Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. అమరావతి వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజుల పాటు ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగనుండగా, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

వర్షాకాలం వచ్చి చాలా రోజులైనా.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. అతిభారీవర్షం పడేంత మబ్బులు కమ్ముకున్నా చిన్నపాటి వర్షం కురుస్తోంది. లేదా చినుకులు పడిపోతున్నాయి.. అంతలోనే ఎండ కూడా వచ్చేస్తోంది. నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ.. సాధారణ వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. ఎల్ నీనో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కాసేపు కూల్‌గా.. మరి కాసేపు ఉక్కపోతగా మారడంతో ప్రజలు ఉక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:
సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
రాయలసీమ:-
సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.
తెలంగాణలో వర్షాలు..
ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉపరితల గాలుల హెచ్చరిక (Wind Advisory):
ఉత్తర – ఈశాన్య తెలంగాణ: ఈ ప్రాంతాల్లో ఉపరితల గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలంగా వీచే అవకాశం ఉంది.
మధ్య – దక్షిణ తెలంగాణ: ఈ ప్రాంతాల్లో ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
