AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?

ఆషాఢం వచ్చేస్తుంది. జూలై 15 నుంచి ఆషాఢం ప్రారంభం కానుంది. అయితే అన్ని మాసాల్లో కెళ్లా దీనిని ప్రత్యేక మాసం అంటారు. ఇది ప్రకృతి, మానవ జీవన శైలితో ముడిపడి ఉంటుంది. అయితే ఆషాఢం వెనకున్న రహస్యాలు తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తి ఉటుంది . కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 13, 2026 | 10:34 AM

Share
భారతీయ సంసృతిలో ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆషాఢ మాసం అంటే జయించలేనిది అని అర్థం. ఈ మాసంలో  ప్రజలు అనారోగ్య సమస్యలు, కష్టాలతో సతమతం అవుతారు. అయితే వాటిని జయించి, బతకగలిగే శక్తి వారికి ఆ భగవంతుడి ఇస్తాడంట. అందువలన ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది.

1 / 5
ఈ మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి దక్షిణాయనం మొదలు అవుతుంది. ఈ సమయంలో దేవతలు నిద్రలో ఉంటారు అంటారు.  2026 సంవత్సరంలో జూలై 15న ఆషాఢ మాసం ప్రారంభం అయ్యి, ఆగస్టు 12 చుక్కల అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాసంలో ఇక ఈ కాలం దేవతలకు "రాత్రి కాలం". ఈ 6 నెలలు మనం చేసే జపం, తపస్సు, దానం వేయి రెట్లు ఫలితం ఇస్తుందని నమ్మకం. అంతే కాకుండా ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట.

2 / 5
అందుకే ఈ సమయంలో పెద్దవారు, చిన్న పిల్లలను ఎక్కువగా బయటకు రానివ్వరు, అలాగే చాలా వరకు  అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ మాసంలో నెగటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే తెలంగాణ, ఆంధ్రాలో బోనాలు, జాతరలు చేసి దుర్గ, పోచమ్మ, ఎల్లమ్మను చల్లబరుస్తారు. అమ్మను ప్రసన్నం చేసుకుంటే ఇంటికి రక్షణగా నిలుస్తుంది అని వారి నమ్మకం

3 / 5
అదే విధంగా ఆషాఢ మాసం అంటేనే వర్షాకాలం. ఈ సమయంలో క్రిములు, పురుగులు ఎక్కువ. శరీరంలో  వేడి తగ్గిపోతుంది. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. అందుకే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. అంతే కాకుండా ఈ మాసంలో ఆడపిల్లలు గోరింటాకు చేతులకు పెట్టుకోవడం చేస్తుంటారు. అలాగే ఈ మాసంలో అనేక ఆచారాలు ఉంటాయి. అత్త కోడలు ఒక్క చోట ఉండకూడదు అంటారు, అంతే కాకుండా కొత్తగా పెళ్లైన జంట కూడా వేరుగా ఉండాలి అంటారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us