ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి.. ఎందుకంటే..?

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని పురస్కార కమిటీ ప్రకటించింది. 2019 ఏడాదికి గానూ ఇథియోపియా దేశ ప్రధాని అబీ అహ్మద్‌ అలీని వరించింది. ఈ నోబెల్‌ శాంతి పురస్కారాన్ని అబీ అహ్మద్‌కు అందజేస్తున్నట్లు స్వీడ‌న్‌లోని స్టాక్‌హోమ్‌లో నోబెల్ కమిటీ వెల్లడించింది. అంతర్జాతీయ సహకారం, శాంతి స్థాపనకు ఆయన చేసిన సేవలకు ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు కమిటీ పేర్కొంది. ముఖ్యంగా సరిహద్దు దేశమైన ఎరిత్రియాతో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అబీ అహ్మద్‌ ఎంతో కృషి చేసినట్లు […]

ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి.. ఎందుకంటే..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Oct 11, 2019 | 3:49 PM

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని పురస్కార కమిటీ ప్రకటించింది. 2019 ఏడాదికి గానూ ఇథియోపియా దేశ ప్రధాని అబీ అహ్మద్‌ అలీని వరించింది. ఈ నోబెల్‌ శాంతి పురస్కారాన్ని అబీ అహ్మద్‌కు అందజేస్తున్నట్లు స్వీడ‌న్‌లోని స్టాక్‌హోమ్‌లో నోబెల్ కమిటీ వెల్లడించింది. అంతర్జాతీయ సహకారం, శాంతి స్థాపనకు ఆయన చేసిన సేవలకు ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు కమిటీ పేర్కొంది. ముఖ్యంగా సరిహద్దు దేశమైన ఎరిత్రియాతో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అబీ అహ్మద్‌ ఎంతో కృషి చేసినట్లు నోబెల్ కమిటీ ట్వీట్‌లో పేర్కొంది.

కాగా, 2018 ఏప్రిల్‌లో అబీ అహ్మద్‌ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు అందుకున్నారు. ఆ తర్వాత వెంటనే సరిహద్దు దేశమైన ఎరిత్రియాతో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేపనిలో పడ్డారు. ఆ దేశంలో శాంతి చ‌ర్చ‌ల‌కు పిలుపునిచ్చి.. ఎరిత్రియా అధ్య‌క్షుడు అవెరికితో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గ‌తేడాది జూలై, సెప్టెంబ‌ర్ల‌లో జ‌రిగిన భేటీల్లో ఇరువురు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎటువంటి ష‌ర‌తులు లేకుండానే అంత‌ర్జాతీయ బౌండ‌రీ చ‌ట్టాల‌ను అమ‌లు చేసేందుకు అబే అంగీక‌రించారు. అయితే ఒక‌రు ముందుకు వ‌స్తే శాంతి నెల‌కొన‌ద‌ని, ఇరువురు కలిస్తేనే అది సాధ్యమవుతుందని.. నోబెల్ క‌మిటీ అభిప్రాయం వ్య‌క్తం చేసింది. అబే ఇచ్చిన స్నేహ హ‌స్తాన్ని ఎరిత్రియా అధ్య‌క్షుడు స్వీకరించడం ద్వారా.. ఇథియోపియా, ఎరిత్రియా దేశ ప్ర‌జ‌ల్లో మార్పులను తీసుకువస్తుందని క‌మిటీ పేర్కొంది.