ఆ కోతికి ఉన్న తెలివి కూడా మనకు లేదా..! వీడియో వైరల్

ఏదైనా అల్లరి పనులు చేస్తే కోతి చేష్టలంటూ సంభోదిస్తారు గానీ.. కనీసం వాటికి ఉన్న తెలివి కూడా మనకు లేకుండా పోతోంది. మనుషులు తమ చేష్టలతో భూమిపై కాలుష్యాన్ని పెంచుతూ పర్యావరణాన్ని చెడగొడుతుంటే.. ఓ కోతి మాత్రం మనం చేయాల్సిన సామాజిక బాధ్యతను గుర్తు చేసింది. వృథాగా పోతున్న నీటిని ఆపేందుకు చాలా సేపే ప్రయత్నించింది. కింద ఉన్న రాళ్లు, ఆకులు, మట్టితో ఆ నల్లాను మూసేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:56 pm, Fri, 11 October 19
ఆ కోతికి ఉన్న తెలివి కూడా మనకు లేదా..! వీడియో వైరల్

ఏదైనా అల్లరి పనులు చేస్తే కోతి చేష్టలంటూ సంభోదిస్తారు గానీ.. కనీసం వాటికి ఉన్న తెలివి కూడా మనకు లేకుండా పోతోంది. మనుషులు తమ చేష్టలతో భూమిపై కాలుష్యాన్ని పెంచుతూ పర్యావరణాన్ని చెడగొడుతుంటే.. ఓ కోతి మాత్రం మనం చేయాల్సిన సామాజిక బాధ్యతను గుర్తు చేసింది. వృథాగా పోతున్న నీటిని ఆపేందుకు చాలా సేపే ప్రయత్నించింది. కింద ఉన్న రాళ్లు, ఆకులు, మట్టితో ఆ నల్లాను మూసేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది.

‘‘వంద నిర్ణయాలను తీసుకోవడం కంటే ఒక గొప్ప పనిని ఆచరణలో పెట్టడం చాలా గ్రేట్. నీటిని కాపాడండి’’.. ‘‘నిన్ను చూసి మేము చాలా నేర్చుకోవాలి’’.. ‘‘నువ్వే నిజమైన హీరోవు’’.. ‘‘అసలు జంతువులం మనమే.. ఈ కోతిని చూసి నేర్చుకుందాం’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఆ మధ్య కాలంలో కోతికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అందులో నీటిని త్రాగిన కోతి.. ఆ తరువాత నల్లాను ఆపుతుంది. ఈ వీడియో కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.

https://twitter.com/Aham_Brhmasmi1/status/1156117398107258881