వైరల్: జనావాసాల్లో వింత జీవి.. అదేంటో తెలుసా..?

కరీంనగర్ జిల్లాలో ఓ వింత జీవి కనిపించింది. ఎక్కడో అరుదుగా కనిపించే పొలుసుల పిపీలికారి అని పిలువబడే క్షీరదము ప్రత్యక్షమైంది. దీనిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ జీవిని కదిలేందుకు ప్రయత్నిస్తే వింతగా ప్రవర్తిస్తుంది. ఎవరైనా ముట్టుకోవడానికి ట్రై చేస్తే ముడుచుకుపోతుంది. దీని శాస్త్రీయనామం పొంగోలిన్. సూదుల్లాంటి పొలుసులు కలిగి ఉన్న ఈ జీవి ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు.. పట్టుకోవడానికి వీలు కాకుండా గుండ్రంలో వలయాకారంలో ముడుచుకుంటుంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు దీనిని పట్టుకుని.. సురక్షింతగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:02 pm, Fri, 11 October 19
వైరల్: జనావాసాల్లో వింత జీవి.. అదేంటో తెలుసా..?

కరీంనగర్ జిల్లాలో ఓ వింత జీవి కనిపించింది. ఎక్కడో అరుదుగా కనిపించే పొలుసుల పిపీలికారి అని పిలువబడే క్షీరదము ప్రత్యక్షమైంది. దీనిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ జీవిని కదిలేందుకు ప్రయత్నిస్తే వింతగా ప్రవర్తిస్తుంది. ఎవరైనా ముట్టుకోవడానికి ట్రై చేస్తే ముడుచుకుపోతుంది. దీని శాస్త్రీయనామం పొంగోలిన్. సూదుల్లాంటి పొలుసులు కలిగి ఉన్న ఈ జీవి ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు.. పట్టుకోవడానికి వీలు కాకుండా గుండ్రంలో వలయాకారంలో ముడుచుకుంటుంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు దీనిని పట్టుకుని.. సురక్షింతగా దగ్గరలో ఉన్న అడవిలో విడిచిపెట్టారు. ఇలాంటి జీవులు చాలా అరుదుగా కనిపిస్తాయని.. ఎక్కడ కనిపించినా.. వాటిని చంపకుండా సురక్షితంగా కాపాడాలని అటవి అధికారులు తెలిపారు.