అమ్మా.. నేను వార్తలు చదువుతా.. లైవ్‌లోకి బుడ్డోడి ఎంట్రీ
సీరియస్‌గా ఓ న్యూస్ ప్రజెంటర్ వార్తలు చదువుతుండగా.. మధ్యలో ఆమె తనయుడు స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన తల్లి లైవ్‌లో కనిపిస్తోందని తెలియని ఆ బుడ్డోడు.. అమ్మతో ముచ్చట్లు పెట్టాలని చూశాడు. దీంతో ఏమీ చేయలో పాలుపోని ఆ యాంకర్.. సారీ చెప్పి.. తన పనిని కొనసాగించింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రముఖ ఇంటర్నేషన్ ఛానెల్‌కు చెందిన కోర్ట్‌నీ క్యూబ్ అనే యాంకర్.. సిరియా విషయంపై లైవ్‌లో రిపోర్ట్ చేస్తోంది. అదే సమయంలో వెనుకాల నుంచి వచ్చేసిన […]

సీరియస్‌గా ఓ న్యూస్ ప్రజెంటర్ వార్తలు చదువుతుండగా.. మధ్యలో ఆమె తనయుడు స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన తల్లి లైవ్‌లో కనిపిస్తోందని తెలియని ఆ బుడ్డోడు.. అమ్మతో ముచ్చట్లు పెట్టాలని చూశాడు. దీంతో ఏమీ చేయలో పాలుపోని ఆ యాంకర్.. సారీ చెప్పి.. తన పనిని కొనసాగించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రముఖ ఇంటర్నేషన్ ఛానెల్‌కు చెందిన కోర్ట్‌నీ క్యూబ్ అనే యాంకర్.. సిరియా విషయంపై లైవ్‌లో రిపోర్ట్ చేస్తోంది. అదే సమయంలో వెనుకాల నుంచి వచ్చేసిన క్యూబ్ తనయుడు ఆమెకు దగ్గరగా వచ్చి.. ఆమెపైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో కాస్త టెన్షన్‌ను గురైన క్యూబ్.. వెంటనే ‘‘సారీ.. నా పిల్లలు ఇక్కడే ఉన్నారు’’ అంటూ వీక్షకులకు క్షమాపణలు చెప్పింది. ఆ తరువాత తన రిపోర్టింగ్‌ను కొనసాగించింది. ఇక అక్కడే ఉన్న టెక్నికల్ సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై క్యూబ్‌ను చూపకుండా.. వేరే విజువల్స్‌ను వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఆ అబ్బాయి క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Sometimes unexpected breaking news happens while you're reporting breaking news. #MSNBCMoms #workingmoms pic.twitter.com/PGUrbtQtT6
— MSNBC (@MSNBC) October 9, 2019