AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసక్తికర పరిణామం.. ప్రధాని మోదీతో మీటింగ్.. సెల్ఫీతోపాటు దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ 2026 కార్యక్రమాన్ని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి ప్రారంభించారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వాణిజ్య సహకారంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ సందర్భంగా భారత్ ప్రపంచానికి పరిష్కారాల కేంద్రంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొనగా, 21వ శతాబ్దంలో భారతదేశం కీలక ప్రపంచ శక్తిగా అవతరించిందని మాక్రాన్ ప్రశంసించారు. ప్రధాని మోదీతో మాక్రాన్ తీసుకున్న సెల్ఫీ, 'ధురంధర్' చిత్రంలోని పాటను ఉపయోగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆసక్తికర పరిణామం.. ప్రధాని మోదీతో మీటింగ్.. సెల్ఫీతోపాటు దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్..
Pm Narendra Modi - Emmanuel Macron
Shaik Madar Saheb
|

Updated on: Jun 15, 2026 | 7:59 AM

Share

ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ 2026 కార్యక్రమాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ప్రారంభించారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు ద్వైపాక్షిక అజెండా ఈ కార్యక్రమంలో ప్రధానాంశాలుగా నిలిచాయి.. ఈ కార్యక్రమంలో 120కి పైగా భారతీయ కంపెనీలు, ఫ్రాన్స్ ,ఇతర దేశాల నుండి ప్రముఖ వ్యాపార వేత్తలు, సీఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచానికి పరిష్కారాల కేంద్రంగా భారత్ ఎదుగుతోందన్నారు. 21వ శతాబ్దంలో భారత్ వేగంగా పురోగతి సాధిస్తోందని.. దేశంలో స్టార్టప్ విప్లవం కొనసాగుతోందని చెప్పారు. యువత సరికొత్త ఆలోచనలతో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా కృషి చేస్తోందన్నారు. మరోవైపు.. భారత్, ఫ్రాన్స్ సంబంధాలు వ్యూహాత్మక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాదన్న మోదీ.. ఉమ్మడి దృక్పథం, విలువలు, ఆవిష్కరణలు, ప్రేరణలపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోదీ.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ ఏఐ, వాణిజ్యం, మౌలిక సదుపాయాలపై చర్చించారు. భారత్ ఇన్నోవేట్స్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతో కలిసి మాక్రాన్ మాట్లాడుతూ, 21వ శతాబ్దానికి ఫ్రాన్స్ వ్యూహాత్మక, పారిశ్రామిక, విద్యా దృక్పథానికి భారతదేశం ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా ఆవిర్భవించడం ఒక కీలక స్తంభంగా మారిందని మాక్రాన్ నొక్కి చెప్పారు.

సెల్ఫీ.. దురంధర్ సాంగ్..

కాగా.. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.. ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకున్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకున్న మాక్రాన్.. ‘మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది’.. అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అంతేకాకుండా.. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురందర్’ చిత్రం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైస్ పర్యటనలోని ముఖ్యాంశాల వీడియోను పోస్ట్ చేసిన.. మాక్రాన్.. దానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గా ‘ఆరీ ఆరీ’ అనే హిట్ పాటను ఉపయోగించారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది..

కాగా.. ఫ్రాన్స్, స్లోవేకియాలలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముంగా నైస్‌కు చేరుకున్నారు. అక్కడ మాక్రాన్ ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. ఇవాళ స్లోవేకియాలో అలాగే పారిస్‌లలో పర్యటిస్తారు.

Follow Us