AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సేఫ్టీ రోప్ కట్టకుండానే యువతిని కిందకు తోసేసిన నిర్వాహకులు.. పాపం ఆ యువతి..

అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎంత థ్రిల్‌ను ఇస్తాయో, చిన్న పొరపాటు జరిగితే అంతే విషాదాన్ని మిగులుస్తాయని బ్రెజిల్‌లో జరిగిన ఓ ఘటన నిరూపించింది. సాహసం కోసం వెళ్లిన ఓ యువతి, నిర్వాహకుల ఘోర తప్పిదం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

సేఫ్టీ రోప్ కట్టకుండానే యువతిని కిందకు తోసేసిన నిర్వాహకులు.. పాపం ఆ యువతి..
Brazil Bungee Jumping tragedy
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2026 | 9:25 PM

Share

సాహసం చేయాలనే ఉత్సాహం… క్షణాల్లోనే విషాదంగా మారింది. బంగీ జంప్‌ కోసం సిద్ధమైన 21 ఏళ్ల యువతి, నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. బ్రెజిల్‌లోని సావోపాలో రాష్ట్రం లిమేరా ప్రాంతంలోని ‘పోంటే డో ఎస్కెలెటో’ బ్రిడ్జి సాహస క్రీడలకు ప్రసిద్ధి. అక్కడ అడ్వెంచర్ గేమ్ కోసం వచ్చిన మరియా రోడ్రిగ్స్ అనే యువతి తన స్నేహితులతో కలిసి బంగీ జంప్‌కు సిద్ధమైంది. మరియా రోడ్రిగ్స్ జంపింగ్ పాయింట్ దగ్గరకు రాగానే, నిర్వాహకులు ఆమెకు హెల్మెట్ తొడిగారు. జంప్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రాథమిక సూచనలన్నీ క్లియర్ గా వివరించారు. అంతా సవ్యంగానే జరుగుతోందని భావించిన మరియా, నిర్వాహకులను పూర్తిగా నమ్మింది. అయితే తాళం వేసి గొళ్లెం మరిచిపోయినట్టుగా అసలైన భద్రతా ప్రమాణాన్ని మాత్రం గాలికొదిలేశారు నిర్వాహకులు. ఆమె కాళ్లకు సురక్షితమైన తాడును కట్టడం పూర్తిగా మర్చిపోయారు. సుమారు 130 అడుగుల ఎత్తు నుంచి ఆమెను కిందకు తోసేశారు. తాడు కట్టలేదని గమనించేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. లోయలో పడిన మరియా రోడ్రిగ్స్‌ తీవ్ర గాయాలతో చనిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. తాము చేసిన ఘోర తప్పిదానికి యువతి చనిపోయిందని గ్రహించిన నిర్వాహకులు ఇద్దరు భయంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు హెలికాప్టర్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి వారిని అదుఫులోకి తీసుకున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించి మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..