రానున్న మూడు నెలలు కీలకం: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

ప్రస్తుత పండుగల సమయాలతో పాటు​, శీతాకాలంలో ప్రజలంతా కరోనా సోకకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు​.

రానున్న మూడు నెలలు కీలకం: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
Ram Naramaneni

|

Oct 23, 2020 | 9:26 PM

ప్రస్తుత పండుగల సమయాలతో పాటు​, శీతాకాలంలో ప్రజలంతా కరోనా సోకకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు​. ఒకప్పుడు రోజుకు 95వేల కేసులు నమోదయ్యేవని… ఇప్పుడు వాటి సంఖ్య 55వేలకే పరిమితమైందని వివరించారు. రికవరీ రేటు 90శాతానికి దగ్గరలో ఉందన్నారు.  ప్రజలంతా కోవిడ్  నిబంధనలు పాటిస్తే కరోనాపై పోరులో ఇండియా​ మెరుగైన స్థితిలో ఉంటుందని చెప్పారు. కొవిడ్ సన్నద్ధతపై ఆరోగ్య, వైద్యవిద్య శాఖల మంత్రులతో ఇవాళ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. భారత్​లో కరోనా స్థితిగతులను మార్చేందుకు  వచ్చే మూడు నెలలు చాలా కీలకమని చెప్పారు. ఉత్తర్​ప్రదేశ్​ వంటి పెద్ద రాష్ట్రంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం వల్లే.. వైరస్​ను కట్టడి చేయగలిగినట్లు హర్షవర్ధన్ పేర్కొన్నారు. గడిచిన మూడు నెలల్లో దేశంలో కొవిడ్ ప్రభావం తగ్గినట్లు తెలిపారు. దేశంలో కొవిడ్ మరణాలు రేటు 1.51శాతంగా ఉందని… దీన్ని ఒక్క శాతంలోపునకు తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Also Read :

Breaking : మళ్లీ గ్రే జాబితాలోనే పాకిస్థాన్ !

దోచుకోడానికి అంబులెన్స్​లో, తస్మాత్ జాగ్రత్త

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu