టర్కీలో ఎంపీ గారి పెళ్లి.. ఎవరా నటి..?
ఈ సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ జహాన్ పెళ్లిపీటలెక్కారు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో ఆమె వివాహం టర్కీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వారిద్దరు సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. వారితో పాటు మరో ఎంపీ, నుస్రత్ స్నేహితురాలు మిమీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. కాగా తన వివాహ వేడుక కారణంగా […]
ఈ సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ జహాన్ పెళ్లిపీటలెక్కారు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో ఆమె వివాహం టర్కీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వారిద్దరు సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. వారితో పాటు మరో ఎంపీ, నుస్రత్ స్నేహితురాలు మిమీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. కాగా తన వివాహ వేడుక కారణంగా లోక్‌సభలో ఎంపీల ప్రమాణ స్వీకారానికి నుస్రత్ గైర్హాజయ్యారు.
Towards a happily ever after with Nikhil Jain ❤️ pic.twitter.com/yqo8xHqohj
— Nusrat Jahan Ruhi (@nusratchirps) June 19, 2019
కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు నుస్రత్. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బసీర్హత్ నుంచి తొలిసారిగా పోటీ చేసి.. ప్రత్యర్థిపై 3.5లక్షల మెజారిటీతో ఆమె గెలుపొందారు.