2023లో పట్టాలెక్కనున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్
రైల్వే మంత్రిత్వశాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ మార్చి 2023 లో పట్టాలు ఎక్కనుంది. ఇవి పూర్తిస్థాయి అత్యాధునిక హంగులతో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి.

రైల్వే మంత్రిత్వశాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ మార్చి 2023 లో పట్టాలు ఎక్కనుంది. ఇవి పూర్తిస్థాయి అత్యాధునిక హంగులతో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి.
రైల్వే ప్రారంభంలో డిసెంబర్ 2019 లో 45 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడానికి 720 బోగీలను తయారు చేయాలని సంకల్పించింది. భారతదేశ మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు ప్రయాణికుల నుండి మంచి స్పందన లభించడంతో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తేవాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భావించింది. రోలింగ్ స్టాక్ ప్రోగ్రామ్‌లో, 2020-2021 లక్ష్యాన్ని 240 బోగీలతో 15 ట్రెయిన్‌లను అందించాలని నిర్ణయించారు. అయితే, కొవిడ్ పరిణామాల దృష్ట్యా ఈ లక్ష్యాన్ని సవరించారు. కోచ్ తయారీ కర్మాగారాల ఉత్పత్తిపై లాక్ డౌన్ ప్రభావం పడింది. దీంతో లక్ష్యయాన్ని సవరించినట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఇందుకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియలోనూ మార్పులు చేసింది. 44 రేక్‌లు అంటే 700-ప్లస్ కోచ్‌లు చేయడానికి మూడు కోట్ల ప్రాజెక్టుకు మూడు కంపెనీలు బిడ్లు సమర్పించాయి. టెండర్ షరతుల ప్రకారం, వాణిజ్య కార్యకలాపాల కోసం మొదటి రెండు ప్రోటోటైప్ రేక్‌లను ఒప్పందం చేసుకున్న తేదీ నుండి 28 నెలల్లో పంపిణీ చేయాలని నిబంధన విధించింది. అయితే, టెండర్‌ను ఖరారు చేసి కాంట్రాక్టు ఇవ్వడానికి ఇంకా తేదీని నిర్ణయించలేదని ఆ వర్గాలు తెలిపాయి. కొత్త రూపొందించే నిబంధనలుకు అనుగుణంగా రైళ్లను తయారు చేయాలని సూచించింది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆమోదించిన కొన్ని మార్పులకు అనుగుణంగా రూపకల్పన చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రూఫింగ్ స్థాయిని రైలు పైన 203 మిమీ నుండి 650 మిమీకి పెంచడం, 160 కిలోమీటర్ల వేగంతో 190 సెకన్ల నుండి 140 సెకన్లకు చేరుకోవడం, ఫైర్ డిటెక్షన్, అలారం వ్యవస్థను ఏకీకృతం చేయడం పొగ, మంటల విషయంలో, రైలు ఆగిన తర్వాతే తలుపులు వెంటనే తెరుచుకునేలా కొన్ని సవరణలతో కొత్త బోగీలను రూపొందించనున్నారు.

