AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రపతికి టెన్త్ క్లాస్ విద్యార్థి లేఖ.. రీజ‌న్ ఏంటంటే..?

అస‌లే క‌రోనా క‌ష్టాలు.. అందుకు తోడు సముద్ర కోతతో నిత్యం ఇబ్బందులు..వీటితో విసిగి వేసారిపోయిన కేరళలోని కొచ్చికి చెందిన టెన్త్ క్లాస్ స్టూడెంట్ సెబాస్టియన్.. తమను ఆదుకోవాలంటూ ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాశాడు.

రాష్ట్రపతికి టెన్త్ క్లాస్ విద్యార్థి లేఖ.. రీజ‌న్ ఏంటంటే..?
Ram Naramaneni
|

Updated on: Jul 27, 2020 | 4:32 PM

Share

Kerala student writes to President  : అస‌లే క‌రోనా క‌ష్టాలు.. అందుకు తోడు సముద్ర కోతతో నిత్యం ఇబ్బందులు..వీటితో విసిగి వేసారిపోయిన కేరళలోని కొచ్చికి చెందిన టెన్త్ క్లాస్ స్టూడెంట్ సెబాస్టియన్.. తమను ఆదుకోవాలంటూ ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఈ విపత్తుల వ‌ల‌న తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటున్న‌ గ్రామంలోని వందలాది కుటుంబాల్లో సెబాస్టియన్ ఫ్యామిలీ కూడా ఉంది. దీంతో ముందడుగు వేసిన బాలుడు త‌మ సమస్యను పరిష్కరించడానికి చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి లేఖ రాశాడు.

బాలుడు లేఖ‌లో త‌న ఆవేద‌న‌ను ఇలా వ్యక్తం చేశాడు….

“మా గ్రామం చెల్లెనం తీవ్రమైన విపత్తుల‌ను ఎదుర్కుంటుంది. మాకు సాయం చేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. నేను కూడా భయంతో ఈ లేఖ రాస్తున్నాను. రుతుపవనాల సమయంలో సముద్ర కోత వల్ల నీరు మా ఇంట్లోకి వ‌స్తుంది. ఈ సంవత్సరం జులై 16 నుంచే సముద్ర కోత మొద‌లైంది. బంధువుల ఇంటికి వెళ్దామని అనుకున్నా.. కానీ క‌రోనా వ్యాప్తి వ‌ల్ల అది కూడా సాధ్య‌ప‌డ‌టం లేదు. స‌ముద్ర‌పు రాకాసి అలలు చెల్లెనంలోని అన్ని ఇళ్లల్లోకి ప్ర‌వేశిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 400 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆరు ఇళ్లు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. మా ఇంట్లోని సామాగ్రితో పాటు నా పుస్తకాలు కూడా ఆగ‌మ‌య్యాయి. రుతుపవనాలు రావ‌డంతో మళ్లీ సముద్ర కోత సంభవిస్తుంది. అరేబియా సముద్రం భారత్​కు ఓ బార్డ‌ర్. ఈ సరిహద్దులను పరిర‌క్షించే బాధ్యత రాష్ట్రపతిది అని నేను పాఠాల ద్వారా తెలుసుకున్నాను. నా చివ‌రి ఆశ మీరే. దయచేసి ఈ విషయంపై స్పందించండి. సముద్రం చుట్టు గోడ నిర్మించేలా చేసి మమ్మల్ని ఆదుకోండి” అని లేఖలో సెబాస్టియన్ పేర్కొన్నాడు.

ఈ లేఖపై రాష్ట్రపతి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ప్రెసిడెంట్ త‌న స‌మ‌స్య ప‌ట్ల స్పందిస్తాడ‌ని సెబాస్టియన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

సెబాస్టియన్ ఇళ్లు