స్వదేశం చేరిన ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులు

ఆఫ్ఘనిస్తాన్‌లో కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన సిక్కులు, హిందువులను బారత దేశానికి రప్పించింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు వారికి విదేశాంగ శాఖ వీసాలు జారీ చేయడంతో ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు.

స్వదేశం చేరిన ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులు
Follow us

|

Updated on: Jul 27, 2020 | 4:06 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన సిక్కులు, హిందువులను బారత దేశానికి రప్పించింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు వారికి విదేశాంగ శాఖ వీసాలు జారీ చేయడంతో ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో సిక్కు కమ్యూనిటీ నాయకుడినిదాన్ సింగ్ సచ్‌దేవాతో సహా 11 మంది మైనారిటీ వర్గాల సభ్యులను గత నెలలో పక్టియా ప్రావిన్స్‌లో అపహరించుకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో జూలై 18 న బందిఖానా నుంచి వారంతా విడుదలయ్యారు. వీరంతా స్వదేశం రావడానికి ఇష్టపడడంతో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వీసాలు మంజూరు చేసి, వారికి ప్రయాణ సదుపాయం కల్పించింది. దీంతో సిక్కు నేత నిదాన్ సింగ్ సచ్‌దేవాతో సహా సిక్కు, హిందూ మతాలకు చెందిన 11 మంది ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా తిరిగి రావడానికి అవసరమైన సహాయాన్ని అందించిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చేసిన కృషిని అభినందిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం వారికి ఇక్కడికి రావడానికి అవసరమైన వీసాలు కల్పిస్తోందన్నారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా భారత్ లో ఉండాలన్నా, తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లాలనుకున్న వారి అభ్యర్థనలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని శ్రీవాస్తవ తెలిపారు.