WTC Final 2021: సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం కివీస్ టీం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ పేసర్ కైల్ జెమీసన్ 80 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. డబ్ల్యూటీసీ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఈ కీవీస్ పేస్ బౌలర్ 5 కీలక వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు. రోహిత్ శర్మ(34 పరుగులు, 68 బంతులు, 6 ఫోర్లు), విరాట్ కోహ్లీ (44 పరుగులు, 132 బంతులు, 1 ఫోర్), రిషబ్ పంత్ (4 పరుగులు, 22 బంతులు, 1ఫోర్), ఇషాంత్ శర్మ(4 పరుగులు, 16 బంతులు) మరియు జస్ప్రీత్ బుమ్రా(0)ల వికెట్లు పడగొట్టాడు. జెమీసన్ (22 ఓవర్లు, 12 మెయిడిన్‌లు, 31పరుగులు, 5 వికెట్లు) కేవలం 8 టెస్టుల్లో 44 వికెట్లు తీసిన తొలి కివీస్ బౌలర్‌గా రికార్డులు క్రియోట్ చేశాడు. అయితే జెమీసన్ న్యూజిలాండ్ తరపున 80 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేశాడు.
అంతకు ముందు, కివీస్ బౌలర్ జాక్ కౌవీ 1930, 1940లలో 8 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. దాదాపు 80 ఏళ్ల నుంచి ఈ రికార్డు చాలా భద్రంగా ఉంది. అయితే, ప్రస్తుతం ఈ రికార్డును కైల్ జెమీసన్ 8 టెస్టుల్లో 44 వికెట్లు తీసి బ్రేక్ చేశాడు. 8 టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన కివీస్ బౌలర్లను ఓ సారి పరిశీలిద్దాం. ఈ లిస్టులో జెమీసన్, జాక్ కౌల్, షేన్ బాండ్, డగ్ బ్రాస్‌కౌల్, హెడ్లీ హోవర్త్ ఉన్నారు. షేన్ బాండ్ 2001 నుంచి 2003 సంవత్సరాల మధ్యలో 38 వికెట్లు పడగొట్టగా, గడ్ బ్రాస్‌వెల్ 2011 నుంచి 2012 మధ్యలో 33 వికెట్లు తన పేర లిఖించుకున్నాడు. అలాగే మరో బౌలర్ హెడ్లీ హోవర్త్ 32 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కివీస్ నిలకడగా ఆడుతోంది. ఆదివారం ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు సాధించింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (30; 104 బంతుల్లో 3ఫోర్లు), డెవాన్ కాన్వే (54; 153 బంతుల్లో 6ఫోర్లు)ఆకట్టుకోగా, కేన్ విలియమ్సన్ (12; 37 బంతులు, 1×4), రాస్ టేలర్ (0)లు క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, అశ్విన్ తలో వికెట్ సాధించారు. న్యూజిలాండ్ ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ అయింది. అజింక్య రహానే (49; 117 బంతుల్లో 5ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (44; 132 బంతుల్లో 1ఫోర్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కివీస్ బౌలర్లలో జేమీసన్ 5, నీల్ వాగ్నర్ 2, బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టారు.
🔸 Jamieson’s five-for 🔸 Latham’s gorgeous drive 🔸 Ashwin’s breakthrough
Vote for your @Nissan #POTD of Day 3 🗳️ https://t.co/1RPwmg2IbA#WTC21 Final | #INDvNZ pic.twitter.com/4WuSVtIJw4
— ICC (@ICC) June 20, 2021
As many as nine wickets fell on Day 3 of the ICC World Test Championship 2021 – @bookingcom brings you some of the best 👇
Spoiler: Kyle Jamieson features heavily in it 🔥 pic.twitter.com/Bq6mXCeGPQ
— ICC (@ICC) June 20, 2021
Also Read:
Tokyo 2020 Summer Olympics: పీవీ సింధు ఒలింపిక్ పతకం సాధించడం అంత సులభం కాదు: జ్వాలా గుత్తా
IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: ముగిసిన మూడవ రోజు ఆట.. న్యూజిలాండ్ స్కోర్ 101/2…